ఆలిండియా రైల్వే కబడ్డీ షురూ

ఆలిండియా రైల్వే కబడ్డీ షురూ

హైదరాబాద్, వెలుగు: ఆలిండియా రైల్వే కబడ్డీ విమెన్స్‌‌ చాంపియన్‌‌షిప్‌‌లో  సౌత్‌‌ సెంట్రల్ రైల్వే జట్టు శుభారంభం చేసింది. సికింద్రాబాద్‌‌లోని రైల్వే స్పోర్ట్స్ కాంప్లెక్స్‌‌లో మంగళవారం (అక్టోబర్ 07) జరిగిన ఆరంభ మ్యాచ్‌‌లో ఆతిథ్య  సౌత్‌‌ సెంట్రల్ రైల్వే 48--–25 తేడాతో నార్త్ ఈస్టర్న్ రైల్వే టీమ్‌‌ను ఓడించింది.  

సౌత్ సెంట్రల్‌‌ రైల్వే స్పోర్ట్స్ అసోసియేషన్ (ఎస్‌‌సీఆర్‌‌‌‌ఎస్‌‌) ఆధ్వర్యంలో ఈ నెల10వ తేదీ వరకు జరిగే ఈ టోర్నీలో  మొత్తం తొమ్మిది రైల్వే జట్లు పాల్గొంటున్నాయి.  అంతకుముందు ఎస్‌‌సీఆర్ అదనపు జనరల్ మేనేజర్ సత్య ప్రకాష్  టోర్నీని లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌‌సీఆర్‌‌‌‌ఎస్‌‌ఏ ప్రెసిడెంట్ అరోమా సింగ్ ఠాకూర్, జనరల్ సెక్రటరీ పి. కోటేశ్వరరావు సహా పలువురు సీనియర్ రైల్వే అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.