టార్గెట్ మల్కాజిగిరి

టార్గెట్ మల్కాజిగిరి

లోక్ సభ ఎన్నికల నగారా మోగడంతో గ్రేటర్ లోని మల్కాజిగిరి లోక్ సభ సీటుపై పార్టీలన్నీ దృష్టి సారించాయి. అధికార పార్టీ సహా మిగతా పార్టీలన్నీ పక్కా ప్లాన్ తో రెడీ అవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‍ఎస్ సెటిలర్లను ప్రసన్నం చేసుకోవడంలో విజయవంతం అయ్యింది. ఈసారి అభ్యర్థి గెలుపోటములను ప్రభావితం చేసే ఆ ఓట్లను ఎలాగైనా తమవైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్, బీజేపీ, టీఆర్‍ఎస్ లు పోటీపడుతున్నాయి. 2014 ఎన్నికల నాటికి 32లక్షల మంది ఓటర్లు ఉన్నారు . ప్రస్తుతం ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఉన్న ఓటర్లలో 50శాతానికి పైగా ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారు . అందులోనూ ప్రధాన

వాటా ఏపీ ప్రజలేనని గణాంకాలు చెబుతున్నాయి. వీరిని తమవైపు తిప్పుకునేందుకు తెలంగాణ నేతలు ఆంధ్రాలోని పార్టీ నేతలతో మంతనాలు మొదలుపెట్టారు . ఇక్కడ కూడా కోస్తా, రాయలసీమ రీజియన్ల వారీగా, కులాల ప్రాతిపదికనవిభజిం చి మరీ లబ్ధిపొందేలా వ్యూహాలను అమలు చేస్తున్నారు . చాలాకాలంగా స్థాని కంగా స్థిరపడిన వారి జాబితా ఇప్పటికే సిద్ధమైపోయిందనే టాక్ ని యోజకవర్గంలో నడుస్తుంది. పార్టీల వారీగా తమ బలాలను బేరీజు వేసుకుంటున్ననేతలు గత ఎన్నికల్లో సెటిలర్ల ఓటు బ్యాంకు, పోలైన ఓట్ల సంఖ్యతో ప్రత్యేక లెక్కల చిట్టాను తయారు చేస్తున్నారు. 2009 నుం చి ఇప్పటివరకు ఈ నియోజకవర్గంలో రెం డుసార్లు ఎన్నికలు జరగగా, మొట్టమొదటిసారి కాం గ్రెస్ పార్టీ గెలిచిం ది. సర్వే సత్యనారాయణ 3.8లక్షల ఓట్లను దక్కిం చుకోగా,70 వేలకు పైగా మెజార్టీ సాధిం చాడు. టీడీపీ నుం చి పోటీ చేసిన భీంసేన్ 2.9లక్షలతో రెండో స్థానా న్ని దక్కిం చుకుంటే, పీఆర్పీ నుంచి టి.దేవేందర్ గౌడ్‍ 2.3లక్షల ఓట్లు, బీజేపీ నుంచి నల్లు ఇంద్రాసేనారెడ్డి1.3లక్షల ఓట్లు, లోక్ సత్తా నుంచి లావు రత్తయ్యకు 1.09లక్షల ఓట్లు పోలయ్యాయి. ఈ ఎన్నికల్లో కేవలం టీడీపీ, కాంగ్రెస్ మధ్య తీవ్ర పోటీ నెలకొనిం ది. 2009లో తెలంగాణ ఉద్యమ సమయం, అప్పటికే రాష్ట్ర విభజన అంశంలో

కాం గ్రెస్ పార్టీ కీలకంగా వ్యవహరిస్తుండటం, తెలంగాణలో ఆంధ్రా నేతల రాజకీయాలు వంటి అంశాలు సెటిలర్ల ఓటర్లను బలంగా ప్రభావితం చేయడంతోపాటు, స్థాన బలంతో కాంగ్రెస్ పార్టీ సులభంగా దక్కిం చుకోగలిగిం ది. అదే ఊపుతో 2014ఎన్నికల్లో రెం డోసారి బరిలో నిలిచింది. రాష్ట్ర విభజన అంశం కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మారడంతో ఇక్కడ టీడీపీ నుంచి గెలిచిన మల్లా రెడ్డి 5.2లక్షల ఓట్లు దక్కిం చుకున్నాడు. అంటే 2009లో టీడీపీకి పోలైన మొత్తం ఓట్ల శాతంలో 7.8% మేర పెరిగాయి. కాం గ్రెస్

పార్టీకి 17.79% ఓట్లు మాత్రమే దక్కాయి. అంటే విభజన అంశంలో కాం గ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం వ్యతిరేక ఫలితాన్నిచ్చేలా సెటిలర్లను ప్రభావితం చేశాయనడంలో ఏమాత్రం సందేహం లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు . మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నియోజకవర్గాల వారీగా టీడీపీ ఓట్లన్నీ టీఆర్ఎస్ కు పోలయ్యాయి. అయితే టీడీపీ, కాంగ్రెస్ పార్టీతో దోస్తీ కలిసొచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు . రాజకీయాలు వయా ఏపీగా నడిపిస్తున్నాయని స్థానిక నేతలు అంటున్నారు.

కార్యకర్తల్లో ఆందోళన

ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్ది మల్కాజిగిరిలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారిపోతున్నాయి. కాం గ్రెస్ పార్టీ నుంచి తెలంగాణ వర్కిం గ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఎన్నికల బరిలో నిలిచాడు. ఇప్పటికే నియోజకవర్గంలో కలిసివచ్చే పార్టీలతో వరుసగా సమావేశమవుతున్నారు . అసెంబ్లీ నియోజ కవర్గాల వారీగా పార్టీ ముఖ్యులు, సీనియర్ నేతలు, కార్యకర్తలతో భేటీ అతున్నారు . టీఆర్ఎస్ నుం చి అభ్యర్ధి ఖరారు కానప్పటికీ సిట్టింగ్ స్థానంపై భారీ ఆశలే పెట్టుకుం ది అధిష్ఠానం. రేవంత్ దూకుడుకు బ్రేక్ వేసే ఆలోచనతో గ్రౌండ్​వర్క్ ను షురూ చేసింది. అభ్యర్థి ఎవరనే దానిపై ఇంకా క్లా రిటీ రాకపోవడంతో టీఆర్‍ఎస్‍ కార్యకర్తల్లో ఉత్కంఠ నెలకొంది. బీజేపీ అభ్యర్ధిగా ఎమ్మెల్సీ రామచంద్రరావు బరిలో ఉంటారో లేదో అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. బీజేపీ నుం చి ఎంపీ బండారు దత్తాత్రేయ, డాక్టర్.లక్ష్మణ్ పోటీపడుతున్నారని వినబడుతోంది. ప్రధానంగా పోరు కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల మధ్యనే ఉంటుం దని విశ్లేషకులు చెబుతున్నారు .