ఏపీకి నీళ్లు దోచుకుపొమ్మని చెప్పింది కేసీఆరే

ఏపీకి నీళ్లు దోచుకుపొమ్మని చెప్పింది కేసీఆరే

ఏపీకి నీళ్లు దోచుకుపొమ్మని చెప్పింది కేసీఆరేనని  ఆరోపించారు అఖిలపక్ష నేతలు. ఇప్పుడు ఏపీ వాళ్లను తిడితే ఏం లాభమని ప్రశ్నించారు. నిపుణుల మాటలు వినే స్థితిలో సీఎం లేరన్నారు. జర్నలిస్ట్ అధ్యయన వేదిక ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో కృష్ణాజలాల వివాదంపై చర్చించారు ఆల్ పార్టీ లీడర్లు. అఖిలపక్షాన్ని ప్రధాని దగ్గరకు తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. పాలమూరు రంగారెడ్డి డిజైన్ మార్పు పొరపాటన్నారు ఇరిగేషన్ నిపుణులు. 

సంగమేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పుట్టిందే ప్రగతిభవన్ లో అన్నారు మాజీమంత్రి నాగం జనార్ధన్ రెడ్డి. మెగా కృష్ణారెడ్డికి ప్రాజెక్టు ఇవ్వమని జగన్ కు చెప్పింది కూడా కేసీఆరే అని ఆరోపించారు. హుజురాబాద్ ఉపఎన్నిక కోసమే జలజగడాన్ని తెరపైకి తెచ్చారని మండిపడ్డారు నేతలు. ఆంధ్రాకు 512, తెలంగాణకు 299 TMCలకు ఒప్పుకొని మొదటి ద్రోహం చేసిందే కేసీఆర్ అన్నారు బీజేపీ సీనియర్ నేత ప్రకాశ్ రెడ్డి. జల వివాదం పరిష్కారానికి కేంద్రం చర్యలు చేపట్టిందన్నారు. ఇక పాలమూరు రంగారెడ్డి కొత్త ప్రాజెక్టు కాదన్నారు టీడీపీ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి. రాజకీయాలకు అతీతంగా కర్నాటకపై పోరుకు సిద్ధం కావాలన్నారు నేతలు.

కృష్ణా జలాల పంచాయతీ కేసీఆర్, జగన్ పెట్టిందేనన్నారు TJS పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీశైలం రెడ్డి. బేసిన్లు లేవు బేషజాలు లేవని చెప్పిన KCRకు విపక్షాలను పిలిచి మాట్లాడేందుకు వచ్చిన ఇబ్బందేంటని ప్రశ్నించారు. మరోవైపు పాలమూరు రంగారెడ్డి డిజైన్ మార్పు పొరపాటన్నారు ఇరిగేషన్ రిటైర్డ్ ఇంజినీర్ రంగారెడ్డి. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన ఆల్ పార్టీ మీటింగ్ లో 7 తీర్మానాలు చేసింది తెలంగాణ జర్నలిస్ట్ అధ్యయన వేదిక. అఖిలపక్షాన్ని ప్రధాని దగ్గరకు తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు నేతలు. కృష్ణాజలాల పంపకాలపై మరో ట్రైబ్యునల్ ఏర్పాటు చేయాలన్నారు. రెండు రాష్ట్రాల సీఎంలు కర్నాటకలో కడుతున్న ప్రాజెక్టులపై దృష్టిపెట్టాలని సూచించారు. SLBC ప్రాజెక్టును వెంటనే ప్రారంభించాలని.. జాతీయ, అంతర్జాతీయ న్యాయసూత్రాల ప్రకారమే నీటి పంపకాలు జరగాలని తీర్మానించారు.