ఘనంగా బిల్‌గేట్స్ కూతురి పెళ్లి.. ఫొటోలు వైరల్

V6 Velugu Posted on Oct 20, 2021

న్యూయార్క్: గతవారం మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ కూతురు వివాహం గ్రాండ్‌గా జరిగింది. బిల్ గేట్స్, మిలిందా గేట్స్‌‌ల పెద్ద కుమార్తె అయిన జెన్నిఫర్ క్యాథరీన్ మ్యారేజ్ అంగరంగ వైభవంగా జరిగింది. ఈజిప్టుకు చెందిన ఈక్వెస్ట్రియన్ నాయెల్ నాజర్‌‌ను జెన్నిఫర్ పెళ్లి చేసుకుంది. న్యూయార్క్‌‌లోని గేట్స్ కుటుంబానికి చెందిన 142 ఎకరాల ఫార్మ్ హౌస్‌‌లో ఈ వేడుకలు జరిగాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ జంట ఫొటోలు వైరల్‌‌గా మారాయి. 

జెన్నిఫర్, నాయెల్.. స్టాన్ ఫోర్డ్ వర్సిటీలో విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు. 2017లో ఈక్వెస్ట్రియన్  సర్క్యూట్‌‌లో కలుసుకున్న ఈ ఇద్దరూ.. ప్రేమలో పడ్డారు. గత సంవత్సరం ఎంగేజ్‌‌మెంట్ చేసుకున్నారు. ఈ ఏడాది జరిగిన టోక్యో ఒలింపిక్స్ పోటీల్లో నాయెల్ పాల్గొన్నాడు. బిల్, మిలిందా గేట్స్ తమ ట్విట్టర్ అకౌంట్లలో నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. 

మరిన్ని వార్తల కోసం:

డ్రగ్స్ తీసుకునేవాళ్లు గోవాకు రావొద్దు: మనోహర్ అజ్గోంకర్

ఎక్కడ గెలవరో.. అక్కడికి హరీశ్‎ను పంపిస్తారు:  బండి సంజయ్ 

లఖీంపూర్ ఘటనపై సుప్రీం సీరియస్

Tagged marriage, Nayel Nassar, Melinda French Gates, Bill Gates Daughter, Jennifer Gates

Latest Videos

Subscribe Now

More News