ఎక్కడ గెలవరో.. అక్కడికి హరీశ్‎ను పంపిస్తారు

ఎక్కడ గెలవరో.. అక్కడికి హరీశ్‎ను పంపిస్తారు

కరీంనగర్: ‘ఎక్కడ గెలవరో అక్కడికి హరీశ్‎ను పంపిస్తారు. హరీశ్ రావును బయటకు పంపడానికి టాస్క్ స్టార్ట్ అయింది. హరీశ్ రావును ఓడిపోయే దగ్గరికి పంపి, గెలిచే దగ్గరికి కేసీఆర్, కేటీఆర్ వస్తారు. హరీశన్నా.. నిన్ను బలిచేస్తారు, జాగ్రత్తగా ఉండు’ అని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. హుజూరాబాద్ ఉపఎన్నిక ప్రచారంలో పాల్గొన్న ఆయన జమ్మికుంట మండలం మడిపల్లి గ్రామంలో మాట్లాడారు.


గొర్రెలు, బర్రెలు అయిపోయాయి.. ఇప్పుడు కోళ్లు ఇస్తారట
‘దళితబంధు అకౌంట్లో డబ్బులేసి ఆపడానికి కేసీఆర్ ఎవరు? దేనికైనా ఆ డబ్బులు వాడుకోవచ్చని చెప్పి ఎందుకు వాడుకోవడానికి అనుమతి ఇవ్వడం లేదు. అదే విషయంపై మేము లేఖ రాశాం తప్ప.. డబ్బులు ఆపమని మేం లేఖ రాయలేదు. ఈ నెల 27న ఇక్కడికి సీఎం వస్తారట.. మేము ఏం రాసామో ఓసారి చదువు. దళితబంధు డబ్బులు ఎవరు ఆపారో ప్రజలు నిర్ణయిస్తారు. సీఎం పక్కా ఢోకాభాజీ. ఎన్నికలప్పుడు హామీలివ్వడం తప్ప ఆయన ఏమీ చేయడు. నిరుద్యోగ భృతి, ఇంటికో ఉద్యోగం అన్నాడు. దళిత ముఖ్యమంత్రి అన్నాడు లేదంటే తల నరుక్కుంటా అన్నాడు. నాగార్జున సాగర్‎లో కూడా ఇలాగే చెప్పాడు. యాదవుల దగ్గర తీసుకున్న వందల కోట్లు అకౌంట్లో పెట్టుకుని గొర్రెలు ఇవ్వడం లేదు. ఈతచెట్ల దగ్గర, తాటిచెట్ల దగ్గర కల్లు అమ్ముకుంటే పోలీసులతో డ్రంక్ డ్రైవ్ చేస్తూ గౌడన్నలను వేధిస్తున్నారు. గొర్రెలు, బర్రెలు అయిపోయాయి.. ఇప్పుడు కోళ్లు ఇస్తారట. గొర్రెలు, బర్రెలు తీసుకున్నోళ్లు ఎంత మంది కోటిశ్వరులు అయ్యారో చెప్పాలి. కేసీఆర్ మోసకారి.. ఆయనను నమ్మకండి. 

ఎక్కడ గెలవరో.. అక్కడికి హరీశ్‎ను పంపిస్తారు
ఈటల రాజేందర్ ఉద్యమకారుడు. హరీశ్ కూడా ఉద్యమకారుడే. సీఎం కొన్ని కమిటీలు వేశాడట. అందులో లంచాలు తీసుకునే కమిటీ, మీడియా ముందు అబద్ధాలు చెప్పే కమిటీ, కమిషన్లు తీసుకునే కమిటీ వేశారు. మళ్లీ ఈటలే గెలుస్తాడు. ఆ తర్వాత బలిపశువుల కమిటీ పెట్టి.. దానికి హరీశ్‎ను అధ్యక్షున్ని చేస్తారు. హరీశ్ రావు మంచోడే. హరీశన్నా.. నిన్ను బలిచేస్తారు. ఎక్కడ గెలవడో.. అక్కడికి హరీశ్‎ను పంపిస్తారు. హరీశ్ రావును బయటకు పంపడానికి టాస్క్ స్టార్ట్ అయింది. హరీశ్ రావును ఓడిపోయే దగ్గరికి పంపి, గెలిచే దగ్గరికి కేసీఆర్, కేటీఆర్ వస్తారు. ఎట్టి పరిస్థితుల్లో హుజురాబాద్‎లో టీఆర్ఎస్ గెలవదని తెలిసి హరీశ్‎ను పంపారు. హరీశ్ మీద మాకు కోపం లేదు. నెక్ట్స్ టాస్క్ నీదే.. నీ మీద గురిపెట్టారు. జాగ్రత్తగా ఉండు. నిన్ను పార్టీ నుంచి బయటకు పంపడానికి స్కెచ్ వేశారు. నీవు అబద్ధాలాడకు హరీశన్నా. మంచి చెప్పు. నీవు ఏం చేశావో చెప్పు. మేం చేసింది కూడా చెబుతాం. పేదోళ్ల పొట్ట కొట్టకండి. హైదారాబాద్‎లో వరదలొస్తే పదివేలు ఇస్తానని ఇవ్వలేదు. నాగార్జున సాగర్‎లో గొర్రెలివ్వలేదు. మీకు న్యాయం జరగాలంటే టీఆర్ఎస్ ఓడాలి. పువ్వు గుర్తు గెలివాలి.  అప్పుడే కేసీఆర్ అహంకారం పోతుంది. కేసీఆర్ కొడుకు, బిడ్డ ఎవరు త్యాగం చేశారు. మన పేదలు త్యాగం చేశారు. శ్రీకాంతాచారి, కానిస్టేబుల్ కిష్టయ్య లాంటి వాళ్లు ప్రాణ త్యాగం చేసారు. 

ఈ నెల 30న గుద్దుడు గుద్దుతే.. టీఆర్ఎస్ బాక్సులు బద్ధలు కావాలి
ఈటల రాజేందర్ పోరాటం చేస్తే తెలంగాణ వచ్చింది. కష్టపడి తెలంగాణ సాధించుకుంటే.. కేసీఆర్ కుటుంబం రాజ్యమేలుతోంది. వాళ్ల కుటుంబంలో ఎవరైనా లాఠీ దెబ్బలు తిన్నారా? అడ్డగోలుగా సంపాదించి.. డబ్బులతో మన ఓట్లు కొనాలని చూస్తున్నారు. కులాల పేరుతో, మతాల పేరుతో మనల్ని చీల్చే ప్రయత్నం చేస్తున్నారు. పేదోళ్లంతా ఒక్కటై పువ్వు గుర్తును గెలిపించాలి. పేదల ఉసరు పోసుకుంటున్న కేసీఆర్‎ను ఓడించాలి. అప్పుడే ఆయన అహంకారం తగ్గి.. ఫామ్ హౌస్ నుంచి బయటకు వస్తాడు. ఈ నెల 30న గుద్దుడు గుద్దుతే.. టీఆర్ఎస్ బాక్సులు బద్ధలు కావాలి. నవంబరు 4న దీపావళి అయితే.. నవంబరు 2న ఫలితాలతో మనకు దీపావళి వస్తుంది. ఉద్యమకారులు జైళ్లో పడితే విడిపించిన నాయకుడు ఈటల రాజేందర్. పేదోళ్ల రాజ్యం రావాలి. మనకు పెద్దోళ్ల పాలన వద్దు. ఎన్ని డబ్బులు ఇచ్చినా తీసుకోండి. రేషన్ బియ్యంపై కేంద్రం 29 రూపాయలు ఇస్తుంది. అయినా రేషన్ షాపు దగ్గర కేసీఆర్ ఫొటోలు పెట్టుకున్నాడు. చెట్లకు, మరుగుదొడ్లకు, రైతు వేదికలకు, గ్రామ పంచాయితీలకు నిధులు ఇస్తున్నది కేంద్రమే. ఈటలను గెలిపిస్తే మరిన్ని నిధులు హుజురాబాద్‎కు వస్తాయి. కేసీఆర్ దిమ్మ తిరగాలి.. గంపగుత్తగా ఈటలను గెలిపించాలి. నేటితో వంద కోట్ల కోవిడ్ టీకా డోసులు పూర్తవుతున్నాయి. ఈ ఘనత మోడీ ప్రభుత్వానిదే’ అని బండి సంజయ్ అన్నారు.

For More News..

ప్రజలను చేరుకోవడానికి పాదయాత్రను మించిన సాధనం లేదు: షర్మిల

లఖీంపూర్ ఘటనపై సుప్రీం సీరియస్

త్వరలో ఫేస్‎బుక్ పేరు మార్పు!