పాదయాత్రను మించిన సాధనం లేదు

పాదయాత్రను మించిన సాధనం లేదు
  • తెలుగువారి గుండె చప్పుడు వైఎస్ఆర్
  • ప్రజలను చేరుకోవడానికి పాదయాత్రను మించిన సాధనం లేదు

తెలుగువారి గుండె చప్పుడు వైఎస్ఆర్ అని వైఎస్ విజయమ్మ అన్నారు. ‘ప్రజా ప్రస్థానం’ పేరుతో వైఎస్ షర్మిల చేవెళ్ల నుంచి పాదయాత్ర మొదలుపెడుతున్న సందర్భంగా ఆమె మాట్లాడారు. వైఎస్ఆర్ కూడా 2003లో చేవెళ్ల నుంచే పాదయాత్ర మొదలుపెట్టారని ఆమె గుర్తు చేశారు. ఆనాడు సబితమ్మ వద్దన్నా కూడా వైఎస్ఆర్ మాత్రం ఇక్కడి నుంచే యాత్ర ప్రారంభించారని విజయమ్మ అన్నారు. ఇప్పుడు తెలంగాణలో రాజన్న రాజ్యం కోసం షర్మిల చేవెళ్ల నుంచి పాదయాత్ర సంకల్పం తీసుకుంటుందని ఆమె తెలిపారు. ప్రజలకు చేరువవడంలో పాదయాత్రను మించిన సాధనం లేదని విజయమ్మ అన్నారు. వైఎస్ఆర్ పాదయాత్ర దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిందని ఆమె అన్నారు. రైతులను రాజులను చేసిన ఘనత వైఎస్ఆర్‎దేనని విజయమ్మ అన్నారు. పాదయాత్రతో మొత్తం రాష్ట్రాన్ని వైఎస్సార్ అవగాహన చేసుకున్నారని ఆమె అన్నారు. 

జలయజ్ఞం పథకం పుట్టింది పాదయాత్ర తోనేనని విజయమ్మ తెలిపారు. కోయిల్ సాగర్, భీమా, నెట్టెంపాడు, చేవెళ్ల ప్రాణహిత, పాలమూరు ప్రాజెక్ట్‎లన్నీ వైఎస్సార్ విజన్‎తోనే వచ్చాయని ఆమె అన్నారు. అందుకే తెలంగాణ గడ్డ.. వైఎస్ కోసం నిలబడిందన్నారు. మహాకూటమి అంటూ అందరు ఏకమైనా.. వైఎస్ మాత్రం ఒంటరిగా పోరాడారని ఆమె అన్నారు. ఆంధ్రా కంటే తెలంగాణలోనే ఎక్కువ సీట్లు ఇచ్చి ఆయనపై ప్రేమను చాటారని విజయమ్మ గుర్తుచేశారు. రాజన్న దూరం అయితే తెలంగాణ ప్రజలు వెక్కివెక్కి ఏడ్చారని ఆమె అన్నారు. తెలంగాణ ప్రజల మనోభావాలు కాపాడేందుకు షర్మిల ఒక అస్త్రంలా మీ ముందుకు వస్తుందని ఆమె అన్నారు. వైఎస్ఆర్‎కు ఏ విధంగా సహకరించారో.. షర్మిలకు కూడా అదేవిధంగా సహకరించి తెలంగాణలో ఓ ప్రభంజనం సృష్టించాలని విజయమ్మ కోరారు.‎ వైఎస్సార్ ఆశయాలను షర్మిల నెరవేరుస్తుందని ఆమె అన్నారు. చరిత్రలో ఎప్పుడు కూడా ఏ మహిళ కూడా పాదయాత్ర చేసిన సందర్భం లేదని గతంలో షర్మిల చేసిన పాదయాత్రను గర్తుచేశారు. గతంలో 50 డిగ్రీల ఎండలో కూడా షర్మిల 3 వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసిందని తెలిపారు. షర్మిల ఏది పట్టుకున్నా సాదించే దాకా వదలదని విజయమ్మ అన్నారు.

For More News..

లఖీంపూర్ ఘటనపై సుప్రీం సీరియస్

త్వరలో ఫేస్‎బుక్ పేరు మార్పు!

మరో 5 రోజుల్లో ఇంటర్ పరీక్షలు.. హాల్‎టికెట్లపై ప్రిన్సిపాళ్ల సంతకం అవసరం లేదు