ఆచార్య‌పై అవ‌న్నీ రూమర్సేన‌ట‌..!

ఆచార్య‌పై అవ‌న్నీ రూమర్సేన‌ట‌..!

ఒక సినిమా తెరకెక్కుతున్నప్పుడు ఆ సినిమా కథ మాదేనంటూ ఎవరో ఒకరు వచ్చి గలాటా చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. స్టార్ హీరోల సినిమాలైతే ఇష్యూ మరింత పెద్దదవుతుంది. ఇప్పుడు చిరంజీవి సినిమాకి ఇలాంటి సమస్యే వచ్చింది. చిరంజీవి, కొరటాల శివ కాంబోలో ‘ఆచార్య’ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రీసెంట్‌‌‌‌గా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌‌‌‌‌‌‌‌ను కూడా రిలీజ్ చేశారు. తర్వాత కాసేపటికే కన్నెగంటి అనిల్‌‌‌‌కృష్ణ అనే రచయిత.. ఆచార్య మోషన్ పోస్టర్‌‌‌‌‌‌‌‌లో కనిపించిన ‘ధర్మస్థలి’ అనే ఎపిసోడ్‌‌‌‌ని తన స్క్రిప్ట్ నుంచి తీసుకున్నారని ఆరోపించాడు. తర్వాత రాజేష్‌ మండూరి అనే అసిస్టెంట్‌‌ డైరెక్టర్ కూడా తన స్టోరీ లైన్‌తో కొర‌‌‌‌టాల సినిమా చేస్తున్నాడంటూ అలిగేషన్స్ మొదలుపెట్టాడు. దాంతో ‘ఆచార్య’ది కాపీ కథ అంటూ వార్త స్ప్రెడ్ అయిపోయింది. దీనిపై ఎట్టకేలకి టీమ్ రియాక్టయ్యింది.

ఇవన్నీ తప్పుడు ఆరోపణలే అంటూ‘ఆచార్య’ను నిర్మిస్తున్నమ్యాట్నీ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైన్‌‌‌‌మెంట్ సంస్థ గురువారం ఓ ప్రెస్‌నోట్‌‌‌‌ విడుదల చేసింది. ‘ఆచార్య సినిమా కాన్సెప్ట్ దర్శ‌‌‌‌కుడు కొర‌‌‌‌టాల శివ‌‌‌‌కు మాత్ర‌‌‌‌మే చెందుతుంది. కాపీ ఆరోపణల‌‌‌‌న్నీ నిరాధార‌‌‌‌మైనవి. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆచార్య సినిమా టైటిల్ లుక్ పోస్ట‌‌‌‌ర్‌‌‌‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి వ‌‌‌‌చ్చిన హైప్ చూసి కొంద‌‌‌‌రు కథ తమదేనంటూ తప్పుడు ఆరోపణలు చేశారు. చాలా తక్కువమందికి మాత్రమే ఈ కథ గురించిన అవగాహన ఉంది. ఈ కథ కోసం మెగాస్టార్‌‌‌‌తో శివ రెండేళ్లపాటు ట్రావెల్ అయ్యారు. ఆయన ఇమేజ్‌‌‌‌కు తగినట్లు పర్‌‌‌‌ఫెక్ట్ ఎంట‌‌‌‌ర్‌‌‌‌టైన‌‌‌‌ర్‌‌‌‌గా కథను సిద్ధం చేశారు. కేవలం మోషన్ పోస్టర్‌‌‌‌ను చూసికొర‌‌‌‌టాలపై ఇలాంటి ఆరోపణలు చేయడం తగదు’ అని నోట్‌‌ద్వారా క్లారిటీ ఇచ్చారు. ఒకప్పుడు రాజేష్‌ తమకి ఒక కథ చెప్పాడని, అందులో బలం లేకపోవడంతో తాము రిజెక్ట్ చేశామని, అంత మంచి కథలు రాసే రచయితే అయితే కొత్త డైరెక్టర్స్‌‌‌‌ని పరిచయం చేయడానికి రెడీగా ఉండే తాము అవకాశం ఇచ్చివుండేవారమని మైత్రి మూవీ మేకర్స్‌‌‌‌ కూడా ఓ నోట్‌‌‌‌ రిలీజ్ చేయడం విశేషం.