
వేసవి సెలవులు, వీకెండ్ తో తిరుమలకు భక్తులు క్యూకట్టారు. సొంత వాహనాలలో భక్తులు కుటుంబ సభ్యులతో తరలిరావడంతో కార్లు బార్లు తీరాయి. వందల సంఖ్యలో కార్లు క్యూ కట్టడంతో తనిఖీలు చేసేందుకు ఆలస్యం అవుతోంది. దీంతో అలిపిరి చెక్ పాయింట్ వద్ద భారీ ట్రాఫిక్ జామ్ అయ్యింది.
వీకెండ్ కావడంతో భక్తులు శనివారం ఉదయం నుంచి భారీగా తరలివస్తున్నారు. దీంతో వాహనాల తనిఖీలకు సుమారు గంటపైగా సమయం పడుతోంది. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు అధికారులు. టోల్ గేట్ నుండి ఆర్చి వరకు వాహనాలు బారులు తీరాయి.
ఉదయం నుంచి వస్తున్న భక్తుల తాకిడికి తిరుమలలో దర్శనం ఆలస్యమవుతోంది. భక్తుల రద్దీ కొనసాగుతుండటంతో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. వేసవి ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు.