ప్రతి రెండు గ్రామాలకు  ఒక ఎమ్మెల్యే చొప్పున ప్రచారం

ప్రతి రెండు గ్రామాలకు  ఒక ఎమ్మెల్యే చొప్పున  ప్రచారం

మునుగోడు  ఉపఎన్నిక ప్రచారంలో  అన్ని పార్టీలు దూకుడు పెంచాయి. తమ  అభ్యర్థి  రాజగోపాల్ రెడ్డిని  గెలిపించాలని బీజేపీ ప్రచారం మొదలు పెట్టింది .  మునుగోడులో బీజేపీ  నియోజకవర్గ ముఖ్య కార్యకర్తలు  సమావేశమయ్యారు.  బీజేపీ  సంస్థాగత  ఇన్ ఛార్జ్ సునీల్ బన్సాల్,  నియోజకవర్గం ఇన్ ఛార్జ్  వివేక్ వెంటస్వామితో సహా పలువురు  నేతలు హాజరయ్యారు.  ఇప్పటికే రాజగోపాల్ ను గెలిపించాలని  బహిరంగ సభలో  కేంద్ర హోంమంత్రి  అమిత్ షా ప్రజలను కోరారు. 

కాంగ్రెస్ అభ్యర్థిగా  పాల్వాయి స్రవంతిని  ప్రకటించింది ఏఐసీసీ. నియోజకవర్గంలోని  175 గ్రామాల్లో  జెండా ఎగరవేయడంతో పాటు, భారీ  బహిరంగ సభ, చార్జిషీట్  రిలీజ్ చేసి  ప్రచారంలో పాల్గొంటుంది కాంగ్రెస్.

ఇవాళ్టి  నుంచే మునుగోడు  నియోజకవర్గ వ్యాప్తంగా  ఆత్మీయ సమ్మేళన  కార్యక్రమాలను టీఆర్ఎస్   చేపట్టింది.  ప్రతి రెండు గ్రామాలకు  ఒక ఎమ్మెల్యే చొప్పున   ప్రచార బాధ్యతలు  తీసుకున్నారు.  జిల్లా మంత్రి, జిల్లా  ఎమ్మెల్యేలు  రోజూ మునుగోడు  నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు.  టీఆర్ఎస్   లో అసంతృప్తులు ... ఆశావాహుల  సంఖ్య ఎక్కువ  కావడంతో అభ్యర్థి  ఎన్నిక ఆలస్యమంది.  ఇంకా అభ్యర్థి పేరు ఖరారు  చేయలేదు అధిష్ఠానం.