షాహీ ఈద్గా మసీదులో సర్వేకు గ్రీన్​సిగ్నల్

షాహీ ఈద్గా మసీదులో సర్వేకు గ్రీన్​సిగ్నల్
  • మధురలో శ్రీకృష్ణ జన్మభూమి వివాదంపై అలహాబాద్ హైకోర్టు తీర్పు

ప్రయాగ్ రాజ్: ఉత్తరప్రదేశ్​ మధురలోని శ్రీకృష్ణ జన్మభూమి వివాదంపై అలహాబాద్ హైకోర్టు గురువారం కీలక తీర్పునిచ్చింది. షాహీ ఈద్గా మసీదు ప్రాంతంలో సర్వే నిర్వహించేందుకు అనుమతించింది. వారణాసిలోని జ్ఞాన్​వాపి మసీదులో సర్వే మాదిరిగానే అడ్వకేట్ కమిషనర్ ఆధ్వర్యంలో షాహీ ఈద్గా మసీదులో సర్వే చేపట్టాలని సూచించింది. కమిషనర్ ఎవరు, విధివిధానాలేంటనేది సోమవారం వెల్లడిస్తామని కోర్టు స్పష్టం చేసింది.

13.37 ఎకరాల జాగలో షాహీ ఈద్గా మసీదును మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ 17వ శతాబ్దంలో నిర్మించారు. అదే ప్లేస్​లో అంతకుముందు కాట్రా కేశవ్​దేవ్ ఆలయం ఉండేదని, దాన్ని కూల్చివేసి మసీదును నిర్మించారని హిందూ సంఘాలు పేర్కొంటున్నాయి. సర్వే నిర్వహించాలని డిమాండ్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశాయి. దీనిపై ముస్లింలు అభ్యంతరం వ్యక్తం చేశారు. హైకోర్టు తీర్పుపై ముస్లిం సంఘాలు సుప్రీం కోర్టును ఆశ్రయించాలని భావిస్తున్నాయి.