శ్రీ కృష్ణ జన్మభూమి కేసు: ఈద్గా కాంప్లెక్స్ సర్వేకు అలహాబాద్​ హైకోర్టు గ్రీన్​ సిగ్నల్​

శ్రీ కృష్ణ జన్మభూమి కేసు: ఈద్గా కాంప్లెక్స్ సర్వేకు అలహాబాద్​ హైకోర్టు గ్రీన్​ సిగ్నల్​

ఉత్తరప్రదేశ్ మధురలోని శ్రీకృష్ణ జన్మభూమి ఆలయం, షాహీ ఈద్గా మసీదు మధ్య వివాదంపై అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. హైకోర్టు తన తీర్పులో వివాదాస్పద స్థలాలను సర్వే చేయాలని ఆదేశించింది. వివాదాస్పద భూమిని అడ్వకేట్ కమిషనర్ ద్వారా సర్వే చేయించాలన్న డిమాండ్​ ను  కూడా కోర్టు ఆమోదించింది.

ఉత్తరప్రదేశ్ మథుర  కృష్ణ జన్మభూమి, -షాహీ ఈద్గా ప్రాంగణాన్ని శాస్త్రీయంగా సర్వే చేయాలని  హిందువుల తరపున దాఖలైన  అలహాబాద్​ హైకోర్టు అంగీకరించింది. ఈ ప్రాంతంలో హిందువులకు చెందిన ఆనవాళ్లు ఎక్కువుగా కనపడుతున్నాయని హిందూ తరపు న్యాయవాది విష్ణు సోమ్ అన్నారు. ఈ వివాదంలో అసలు విషయాలు బయటకు రావాలంటే కమిషన్​ అవసరమని హిందువుల పిటిషన్​ ను స్వీకరించిన కోర్టు ఈద్గా కాంప్లెక్స్ పై కోర్టు కమిషన్ సర్వేను ఆమోదించింది. హిందూ తరపు న్యాయవాది మాట్లాడుతూ కమిషన్​ సర్వేకు సంబంధించిన వివరాలు డిసెంబర్​ 18న నిర్ణయిస్తారని తెలిపారు.  అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి ఆలయ ప్రధాన పూజారి  ఈ విషయంపై మాట్లాడుతూ.. సర్వే చేయడం చాలా ముఖ్యమని... అందులో వాస్తవాలు బయటకు వస్తాయని ఆచార్య సత్యేంద్ర దాస్ తెలిపారు. 

అలహాబాద్ హైకోర్టు గురువారం ( డిసెంబర్​14)  తీర్పు వెలువరిస్తూ, హిందూ పక్షం పిటిషన్​ను ఆమోదించింది. ఈ కేసులో జస్టిస్ మయాంక్ కుమార్ జైన్ తో  కూడిన సింగిల్ బెంచ్ మధ్యాహ్నం 2 గంటలకు తీర్పు వెలువరించింది. తన నిర్ణయంలో, జ్ఞాన్వాపి వివాదం తరహాలో, న్యాయస్థానం న్యాయవాది కమీషనర్ ద్వారా మథురలోని వివాదాస్పద స్థలాల సర్వేను కూడా నిర్వహించాలని ఆదేశించింది.

న్యాయవాదులు హరిశంకర్ జైన్, విష్ణు శంకర్ జైన్, ప్రభాష్ పాండే, దేవకీ నందన్ ద్వారా లార్డ్ శ్రీ కృష్ణ విరాజ్ మన్ సహా మరో ఏడుగురు ఈ పిటిషన్ ను దాఖలు చేశారు. ఇందులో కృష్ణుడి జన్మస్థలం  మసీదు క్రింద ఉందని, ఆ  మసీదు హిందూ దేవాలయమని నిరూపించే అనేక సంకేతాలు ఉన్నాయని పేర్కొన్నారు. హిందూ తరపు న్యాయవాది విష్ణు శంకర్ జైన్ ప్రకారం, హిందూ దేవాలయాల లక్షణం, హిందూ దేవతలలో ఒకటైన శేషనాగ్ ప్రతిరూపమైన తామరపువ్వు ఆకారంలో స్తంభం ఉందని పిటిషన్ లో పేర్కొన్నారు.

కృష్ణ జన్మభూమి-షాహీ ఈద్గా ప్రాంగణాన్ని శాస్త్రీయంగా సర్వే చేయాలని కోరుతూ  శ్రీ కృష్ణ జన్మభూమి ముక్తి నిర్మాణ్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది.కృష్ణ జన్మభూమి-షాహీ ఈద్గా భూవివాదానికి సంబంధించి పలు దావాలు మధురలోని కోర్టుల ముందు పెండింగ్​ లో  ఉన్నాయి.  అలహాబాద్ హైకోర్టులో ఈ సమస్య పెండింగ్ లో ఉన్నందున మేము మా అధికార పరిధిని ఉపయోగించాల్సిన అవసరం లేదని జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, సుధాన్షు ధులియాతో కూడిన ధర్మాసనం పేర్కొంది. కృష్ణ జన్మభూమి-షాహీ ఈద్గా ప్రాంగణాన్ని శాస్త్రీయంగా సర్వే చేయాలని కోరుతూ  శ్రీ కృష్ణ జన్మభూమి ముక్తి నిర్మాణ్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. మసీదులోని 13.37 ఎకరాల భూమికి సంబంధించి వివాదం నడుస్తోంది. శ్రీకృష్ణ ఆలయం, షాహీ ఈద్గా పక్కపక్కనే ఉన్నాయి.

నిర్ణీత గడువులోగా సర్వే అనంతరం నివేదిక సమర్పించేందుకు నిర్దిష్ట సూచనలతో కమిషన్ ను  ఏర్పాటు చేయాలని పిటిషనర్లు కోరారు. ఈ మొత్తం ప్రక్రియ ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీని నిర్వహించాలని అభ్యర్థించారు. మధుర కోర్టులో పెండింగ్ లో ఉన్న శ్రీకృష్ణ జన్మభూమి-షాహీ ఈద్గా మసీదు వివాదానికి సంబంధించిన అన్ని కేసులను అలహాబాద్ హైకోర్టు ఈ ఏడాది మేలో బదిలీ చేసింది