మదర్సా విద్యాచట్టం 2004పై అలహాబాద్ హైకోర్ట్ కీలక ఉత్తర్వులు

మదర్సా విద్యాచట్టం 2004పై అలహాబాద్ హైకోర్ట్ కీలక ఉత్తర్వులు

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఇస్లామిక్ విద్యాసంస్థలపై సర్వే నిర్వహించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్షుమ‌న్ సింగ్ రాథోడ్ దాఖ‌లు చేసిన పిటిష‌న్ విచార‌ణ సంద‌ర్భంగా హైకోర్ట్ శుక్రవారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది.  యూపీ బోర్డ్ ఆఫ్ మదర్సా ఎడ్యుకేషన్ చట్టం 2004  రాజ్యాంగ విదుద్ధమని స్పష్టం చేసింది. 

లౌకిక వాదానికి ఆ చట్టం ఉల్లంఘిస్తోందని పేర్కొంది. మదర్సాల్లో విద్యార్థులను సాధారణ విద్యాసంస్థల్లో చేర్చే ఆలోచనలను రూపొందించాలని యూపీ ప్రభుత్వాన్ని ధర్మాసనం  ఆదేశించింది.  విదేశాల నుంచి మ‌ద‌ర్సాల‌కు వ‌చ్చే నిధుల‌పై ద‌ర్యాప్తు చేప‌ట్టేందుకు యూపీ గవర్నమెంట్ 2023 అక్టోబ‌ర్‌లో సిట్ ఏర్పాటు చేసింది.