Aa Okkati Adakku Teaser: పెళ్లి అనేది పాన్ ఇండియా సమస్య..అల్లరోడు పెళ్లి కోసం తంటాలు

Aa Okkati Adakku Teaser: పెళ్లి అనేది పాన్ ఇండియా సమస్య..అల్లరోడు పెళ్లి కోసం తంటాలు

కొంత కాలంగా వరుస సీరియస్ సబ్జెక్టులతో మెప్పిస్తున్న అల్లరి నరేష్(Allari Naresh).. తిరిగి తనదైన హాస్యంతో ప్రేక్షకులను నవ్వించడానికి రెడీ అవుతున్నాడు. తాజాగా తన 61వ సినిమా అయిన ఆ ఒక్కటీ అడక్కు (Aa Okkati Adakku) తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. మల్లి అంకం దర్శకుడి గా పరిచయమవుతున్న ఈ మూవీ టైటిల్ గ్లింప్స్‌‌ తో ఆకట్టుకోగా..తాజాగా టీజర్ రిలీజ్ చేశారు.  

మొత్తంగా 66 సెకన్ల పాటు ఉన్న ఈ టీజర్ ఆద్యంతం సరదాగా సాగింది. తన కామెడీ టైమింగ్‍తో అల్లరి నరేశ్ అదరగొట్టారు. తన మార్క్ ఎంటర్‌టైన్‍మెంట్‍తో నవ్వుకునేలా ఉంది. పెళ్లి కోసం ఆరాటపడే యువకుడు గణ పాత్రను పోషించిన అల్లరోడు..తనదైన కామెడీతో అల్లరి చూపించాడు.

అతడికి 25 రోజుల 10 గంటల 5 నిమిషాల్లోగా పెళ్లి జరగాలని, లేకపోతే జన్మంతా బ్రహ్మాచారిగానే ఉండిపోతాడని జ్యోతిష్యుడు చెప్పడంతో టీజర్ షురూ అయింది. ఆ తర్వాత పెళ్లెప్పుడు అని గణ (అల్లరి నరేశ్)ను అందరూ అడుగుతుంటారు. అతడికి పెళ్లి సంబంధం కుదిర్చేందుకు ఫ్యామిలీ మెంబర్స్ పలు విధాలుగా ట్రై చేయడం ఆకట్టుకుంటోంది.

పెళ్లి అనేది పాన్ ఇండియా సమస్య అని చెప్పడం సినిమాపై బజ్‌‌ను పెంచేలా ఉంది. ఫరియా అబ్దుల్లా(FariaAbdullah) హీరోయిన్‌‌గా నటిస్తున్న ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, జామీ లీవర్, వైవా హర్ష, అరియానా గ్లోరీ ఇతర పాత్రల్లో కనిపించనున్నారు.

నరేష్ తండ్రి ఈవీవీ సత్యనారా యణ ఇరవై రెండేళ్ల  క్రితం ఇదే టైటిల్‌‌తో సూపర్ హిట్‌‌ను అందించిన సంగతి తెలిసిందే. మళ్లీ ఇన్నాళ్లకు తన తండ్రి టైటిల్‌‌తో వస్తున్నాడు నరేష్. 

సెన్సిబుల్ మ్యూజిక్ డైరెక్టర్ గోపీ సుందర్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని రాజీవ్ చిలక నిర్మిస్తున్నారు. భరత్ లక్ష్మీపతి సహ నిర్మాత..మార్చి 22న ఆ ఒక్కటీ అడక్కు థియేటర్లో రిలీజ్ అవుతుందని ప్రకటించిన విషయం తెలిసిందే.

అయితే, ఈ సినిమా విడుదల వాయిదా పడినట్టు సమాచారం. ఇపుడు టీజర్లో కూడా రిలీజ్ డేట్ లేదు. వేసవికి ఈ చిత్రం రాబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలో ఆ ఒక్కటి అడక్కు రిలీజ్ డేట్‍ను మేకర్స్ ఖరారు చేసే అవకాశం ఉంది.