
టాలీవుడ్ ఇండస్ట్రీలో సెన్సిటీవ్ చిత్రాలు చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు దర్శకుడు శేఖర్ కమ్ముల(Shekar Kammula). మొదటి సినిమా ఆనంద్ నుండి మొన్నొచ్చిన లవ్ స్టోరీ(Love Story) వరకు ఆయన చిత్రాలన్నీ అలానే ఉంటాయి. కేవలం భావోద్వేగాలపై కథను నడిపించడం ఆయన స్పెషాలిటీ. అలా వచ్చినవే.. ఆనంద్, గోదావరి, హ్యాపీ డేస్, లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్, ఫిదా, లవ్ స్టోరీ సినిమాలు. ఆయన సినిమాల్లో హీరోయిజం ఉండదు కథే ఆయన బలం. అందుకే ఆయన సినిమాలకు సెపెరేట్ ఫ్యాన్ బేస్ ఉంది.
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం శేఖర్ కమ్ముల తన కెరీర్ లో ఫస్ట్ పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. కుబేర పేరుతో వస్తున్న ఈ సినిమాలో తమిళ స్టార్ ధనుష్, కింగ్ నాగార్జున, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా నటిస్తున్నారు. అంతేకాదు స్టార్స్ తో ఆయన చేస్తున్న మొదటి సినిమా కూడా ఇదే కావడం విశేషం. ఆయన ఇప్పటివరకు స్టార్ హీరోలతో సినిమాలు చేయలేదు. కానీ, ఆయన మొదటి సినిమా కథను మాత్రం ఒక స్టార్ హీరో కోసమే రాసుకున్నారట. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఆ సినిమా ఏదంటే.. ఆనంద్. రాజా హీరోగా చేసిన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. మంచి కాఫీ లాంటి సినిమా అంటూ వచ్చిన ఈ సినిమా డీసెంట్ హిట్ గా నిలిచింది. నిజానికి ఈ సినిమా కథను శేఖర్ కమ్ముల పవన్ కళ్యాణ్ కోసమే రాసుకున్నాడట. పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించే ఆయన ఆ పాత్రను డిజైన్ చేసుకున్నారట. కానీ.. ఆ సమయంలో శేఖర్ కమ్ములకి అంత ఫేమ్ లేకపోవడంతో పవన్ కళ్యాణ్ ను కలిసే అవకాశం దొరకలేదట. అలా పవన్ కళ్యాణ్ చేయాల్సిన ఆనంద్ మూవీ రాజా చేసి మంచి విజయాన్ని అందుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న పవన్ ఫ్యాన్స్ ఎందుకు మిస్ చేశావ్ శేఖర్ అన్నా. ఆ సినిమా పవన్ కళ్యాణ్ చేసుంటే ఖచ్చితంగా ఆయన కెరీర్ లో ఒక ప్రత్యేకమైన సినిమాగా మిగిలిపోయేది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.