
అపర కుబేరుడు ముకేష్ అంబానీ భార్యగా..రిలయన్స్ పౌండేషన్ చైర్ పర్సన్ హోదా లో..అనంత్ అంబానీ తల్లిగా నీతా అంబానీ (Nita Ambani) జరిగే ప్రతి ఈవెంట్ లో స్పెషల్గా నిలుస్తుంది. ముకేష్ అంబానీ భార్య నీతా అంబానీకి ఎవ్వరూ సాటిలేరు అనేలా తనదైన చీరలను ధరిస్తూ..నగలతో ముస్తాబూవుతోంది.
అయితే లేటెస్ట్గా నీతా అంబానీ తన అలంకరణ మొదలు..తన హడావిడి వరకు ప్రతీది వావ్ అనేలా వెరీ స్పెషల్ అంతే! అన్నట్టుగా మరో ఈవెంట్ లో మెరిసింది. ప్రతిష్టాత్మక మిస్ వరల్డ్ 2024 ఈవెంట్ సందర్భంగా నీతా అంబానీ రూ. 200 కోట్ల విలువైన ఆభరణంతో అబ్బురపరిచింది.
ఇటీవల ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన మిస్ వరల్డ్ 2024(Missworld2024)గ్రాండ్ ఫినాలేలో విలాసవంతమైన ఫ్యాషన్ ఎంపికలకు నీతా అంబానీ మరోసారి దృష్టిని ఆకర్షించారు.
మెరిసే చేనేత నల్లటి చీరలో ఆకర్షణీయంగా కనిపించింది. ఇది బనారసీ చీర, మెరిసే బంగారం జరీతో చేత్తో రూపొందించిన జంగ్లా డిజైన్ చీరలో కనిపించింది. ఈ చీర యొక్క గొప్ప స్పెషాలిటీ ఏంటంటే..భారతదేశ సంస్కృతిని తెలుపుతు..గొప్ప వారసత్వాన్ని ప్రతిబింబించడమే కాకుండా ఆమె రాజరిక సౌరభాన్ని కూడా ఆవిష్కరించేలా చేసింది. మీనాకరి డీటెయిలింగ్.. పూల జాలుతో సంప్రదాయ హస్తకళా నైపుణ్యంతో రూపొందించిన చీర అవ్వడంతో..ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ చీర ఖరీదు రూ. 50 లక్షలు ఉంటుందని అంచనా.
అంతేకాకుండా ఈ ఈవెంట్లో మొఘల్ చక్రవర్తుల రాణులకు చెందిన ఆభరణాలు ధరించి నీతా అంబానీ వావ్ అనిపించుకుంది. ఆమె చేతిని అలంకరించిన అద్భుతమైన బాజుబ్యాండ్ కూడా అందరి దృష్టిని ఆకర్షించింది.
అయితే ఇక్కడ అందరూ నోరెళ్లపెట్టేలా చేసిన విషయం ఏంటంటే..ఈ బాజుబ్యాండ్ చరిత్రలోని ప్రఖ్యాత మొఘల్ చక్రవర్తి షాజహాన్‌కు చెందిన కల్గీ అని తెలిసింది. టోపోఫిలియా అనే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లో ఈ ఆభరణం కనిపించింది. దీని ఖరీదు సుమారు రూ.200 కోట్లకు పైగా ఉంటుందని అంచనా.
రీసెంట్గా నీతా అంబానీ ధరించిన డైమండ్ నెక్లెస్ ధర ఎంతో తెలుసుకోవడానికి నెటిజన్స్ ఆసక్తి చూపిన సంగతి తెలిసిందే. ఈ డైమండ్ నెక్లెస్ ధర సుమారు రూ.500 కోట్ల మధ్యలో ఉంటుందని అంచనా.
హస్తకళలో నేసిన చీరలు..చరిత్రలో మహారాణులు ధరించే ఆభరణాలు ఇక ఇవన్నీ చూస్తుంటే..ఇది సున్నితమైన హస్తకళలు లగ్జరీపై నీతా అంబానీకి ఉన్న ప్రవృత్తికి నిదర్శనం అని తెలుస్తోంది.
నీతా ముఖేష్ అంబానీకి దాతృత్వం మరియు సామాజిక సేవ పట్ల ఉన్న నిబద్ధతకు గుర్తింపుగా మిస్ వరల్డ్ ఫౌండేషన్ వారి ‘మానవతావాద అవార్డు’(హ్యుమానిటేరియన్ అవార్డు)ని గెలుచుకుంది. 28 ఏళ్ల విరామం తర్వాత భారత్‌కు వచ్చిన జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన మిస్ వరల్డ్ 2024 పోటీల 71వ ఎడిషన్‌లో మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ చైర్మన్ మరియు సీఈఓ జూలియా మోర్లీ ఈ అవార్డును అందజేశారు.