
- వెల్లడించిన సెబీ చీఫ్ మాధవి
ముంబై : చిన్న మధ్యతరహా పరిశ్రమల (ఎస్‌ఎంఈ) విభాగంలో ప్రైస్ మానిప్యులేషన్ "సంకేతాలు" కనిపిస్తున్నాయని క్యాపిటల్ మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ చైర్‌పర్సన్ మాధవీ పూరీ బుచ్ సోమవారం అన్నారు. ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపిఓ)తోపాటు, ట్రేడింగ్‌లోనూ అవకతవకలు జరుగుతాయని
పెట్టుబడిదారులు జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. "మేము అలాంటి సంకేతాలను (ప్రైస్ మానిప్యులేషన్) చూస్తున్నాము. ఇలాంటి వాటిని అడ్డుకోవడానికి మాకు టెక్నాలజీ ఉంది. ప్రస్తుతానికి సంకేతాలే కనిపిస్తున్నాయి. ఇంకా అక్రమాలు మొదలుకాలేదు”అని మాధవీ పురి వివరించారు.