
నాంది, ఉగ్రం వంటి సీరియస్ సబ్జెక్టులతో ఆకట్టుకున్న నరేష్.. తాజాగా మరో డిఫరెంట్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ‘సోలో బ్రతుకే సో బెటరు’ ఫేమ్ సుబ్బు దీనికి దర్శకుడు. రాజేష్ దండా, బాలాజీ గుత్తా నిర్మిస్తున్నారు. శుక్రవారం పూజా కార్యక్రమాలతో ఈ సినిమాని ప్రారంభిస్తూ.. దీనికి ‘బచ్చల మల్లి’ అనే టైటిల్‌ను అనౌన్స్ చేశారు. అతిథిగా హాజరైన డైరెక్టర్ అనిల్ రావిపూడి క్లాప్ కొట్టగా, ముహూర్తం షాట్‌కు ప్రతాప్ రెడ్డి కెమెరా స్విచాన్ చేశారు. విజయ్ కనకమేడల తొలి షాట్‌కు గౌరవ దర్శకత్వం వహించాడు.
మారుతి, బుచ్చిబాబు మేకర్స్‌కి స్ర్కిప్ట్‌ను అందజేశారు. నరేష్ నటిస్తున్న 63వ సినిమా ఇది. అమృత అయ్యర్ హీరోయిన్. రోహిణి, రావు రమేష్, సాయి కుమార్, ధనరాజ్, హరి తేజ, ప్రవీణ్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. 1990 బ్యాక్‌డ్రాప్‌లో రూపొందనున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను త్వరలో స్టార్ట్ చేస్తామన్నారు దర్శక నిర్మాతలు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తుండగా, చోటా కె ప్రసాద్ ఎడిటర్‌గా, ప్రొడక్షన్ డిజైనర్‌గా బ్రహ్మ కడలి, కెమెరామెన్‌గా రిచర్డ్ ఎం నాథన్ వర్క్ చేయనున్నట్టు ప్రకటించారు.