ఆడియన్స్కు సర్ప్రైజ్ ఇచ్చిన నా సామిరంగ టీమ్.. అంజి గాడిగా అల్లరోడు

ఆడియన్స్కు సర్ప్రైజ్ ఇచ్చిన నా సామిరంగ టీమ్.. అంజి గాడిగా అల్లరోడు

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) నటిస్తున్న లేటెస్ట్ మూవీ నా సామిరంగ(Naa Saami Ranga). ఆషికా రంగనాథ్‌ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను డాన్స్ మాస్టర్ విజయ్‌ బన్నీ తెరకెక్కిస్తున్నాడు. శ్రీనివాస్‌ చిట్టూరి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా.. సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజైన టీజర్ అండ్ సాంగ్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. 

ఇక తాజాగా నా సామిరంగ టీమ్ ఆడియన్స్ కు అదిరిపోయే ట్విస్టు ఇచ్చింది. అదేంటంటే.. ఈ సినిమాలో అల్ల‌రి న‌రేష్ అంజి అనే కీలక పాత్ర‌లో కనిపించనున్నారు. ఇదే విషయాన్ని ఈరోజు(డిసెంబర్ 14) ప్రకటించారు. అంతేకాదు ఆయన పాత్రకు సంబందించిన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. మా అంజి గాడ్ని మీకు ప‌రిచ‌యం చేస్తున్నాం.. లేదంటే మాటోచ్చేత్త‌ది.. అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇక అంజి గాడి పాత్రకు సంబంధించిన స్పెష‌ల్ ప్రోమోను రేపు(డిసెంబర్ 15) ఉదయం 10.18 గంట‌ల‌కు విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు మేక‌ర్స్.