
పెగాసస్ ప్రాజెక్టుపై దర్యాప్తుకు ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం ఈ పిటిషన్లను విచారించింది. మీడియాలో వచ్చిన వార్తలు నిజమైతే పెగాసస్ వ్యవహారంను తీవ్రంగా పరిగణిస్తామని తెలిపింది సుప్రీంకోర్టు. పిటిషనర్లు పిటిషన్ కాపీలను కేంద్ర ప్రభుత్వానికి కూడా అందించాలని సూచించింది. నిజం బయటకు రావాల్సిందేనని అభిప్రాయపడింది సుప్రీంకోర్టు. ఎవరిని టార్గెట్ చేశారన్నది తెలియదని తెలిపింది. జర్నలిస్టు ఎన్.రాము తరపున వాదనలు వినిపించారు అడ్వకేట్ కపిల్ సిబల్. కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేయాలని చీఫ్ జస్టిస్ ను కోరారు. పెగాసస్ పై విచారణను ఆగష్టు 10కి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. తదుపరి విచారణకు కేంద్రం కూడ హాజరుకావాలని ఆదేశించింది.