ముగిసిన రాజీవ్ స్వగృహ ఫ్లాట్ల కేటాయింపు

ముగిసిన రాజీవ్ స్వగృహ ఫ్లాట్ల కేటాయింపు
  • బండ్ల గూడ, పోచారంలో 923 మందికి ఫ్లాట్లు  కేటాయింపు


హైదరాబాద్, వెలుగు: బండ్లగూడ, పోచారంలో రాజీవ్ స్వగృహ ఫ్లాట్ల లాటరీ పూర్తయింది. రెండు ప్రాంతాల్లో ట్రిపుల్ బెడ్రూమ్ డీలక్స్, ట్రిపుల్ బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్, సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్లు 2,200 ఉండగా 1,393 మంది డీడీలు కట్టారు.

లాటరీ తీయగా బండ్లగూడలో 804, పోచారంలో 119.. మొత్తం 923 మందికి ఫ్లాట్లు దక్కినట్లు హెచ్ఎండీఏ అధికారులు ప్రకటించారు. లాటరీలో ఫ్లాట్లు దక్కించుకున్న వారి వివరాలు www.hmda.gov.in, www.swagruha.telangana.gov.in సైట్లలో ఉంచినట్లు అధికారులు తెలిపారు.