
- దోస్త్ స్పెషల్ ఫేజ్ సీట్ల కేటాయింపు
హైదరాబాద్, వెలుగు: దోస్త్ స్పెషల్ ఫేజ్ సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. ఈ ఫేజ్ లో 12,756 మందికి సీట్లు అలాట్ చేసినట్టు హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి తెలిపారు. మొత్తం 13,093 మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోగా, ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చిన వారిలో 11,616 మందికి, సెకండ్ ప్రయారిటీలో 1,140 మందికి సీట్ అలాట్ అయిందన్నారు. వెబ్ ఆప్షన్లు ఇచ్చినప్పటికీ 337 మందికి సీటు అలాట్ కాలేదన్నారు. సీటు అలాట్ అయిన స్టూడెంట్స్ ఈ నెల 16 వరకు సంబంధిత కాలేజీల్లో ఫీజు చెల్లించి రిపోర్ట్ చేయాలని సూచించారు.