
తిరుమలలో ముస్లిం వ్యక్తి నమాజ్ చేసిన విషయంపై ఎస్పీ వి. హర్షవర్దన్ రాజు స్పందించారు. తిరుమల కళ్యాణ వేదికను సందర్శించిన ఆయన అక్కడ స్థానికులు.. విజిలెన్స్ మరియు పోలీస్ అధికారులను విచారించారు. తిరుమలలో అన్యమతస్తులు ప్రార్థన చేసుకున్న విషయంపై ఆరాతీ శారు.
తిరుమలకు TN 83T6705 నెంబరుగల కారులో యాత్రికులు శ్రీవారి దర్శనం కోసం వచ్చి, వారు దర్శనానికి వెళ్ళినప్పుడు, వారి తో పాటు వచ్చిన కారు డ్రైవర్ ఆ కారు ను కళ్యాణ వేదిక వద్ద పార్కింగ్ ప్రదేశం లో పార్క్ లో ఉంచి, ఆ యాత్రికులు వచ్చేవరకు వేచి యున్నాడు. అతను ముస్లిం మతానికి చెందిన వ్యక్తి కావడంతో అతను మధ్యాహ్నం ప్రార్థన సమయానికి అతను శ్రీవారి కల్యాణ వేదిక పక్కన షెడ్ ఖాళీ స్థలములో ప్రార్థనలు చేసుకుని అక్కడినుండి కారు లో వెళ్ళిపోయాడు.అయితే ఈ విషయమై కొందరు వ్యక్తులు దానిని చిత్రీకరించి సోషల్ మీడియాలో పెట్టడం జరిగినదని ఆయన తెలిపారు.ఈ ఘటనపై కారు డ్రైవర్ ను విచారిస్తామన్నారు. తిరుమల లో సిసి కెమెరాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ.. అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు.
తిరుమలలో అన్యమత ప్రచారం చేయకూడదనే రూల్ ఉన్నా అతిక్రమించడంపై పలువురు భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమలలో అన్యమతస్తులు ప్రార్ధనలు చేయడం వెంకన్న స్వామికి అపచారం చేయడమేనని భక్తులు మండిపడ్డారు. గత ఘటనల దృష్ట్యా ఇప్పటికైనా పటిష్ట నిఘా ఏర్పాటు చేయకపోవడంపై విమర్శలు చేస్తున్నారు.