రూ.కోటి ఖరీదైన ఇంటిని ఇలా అప్పుచేసి కొంటే రూ.50 లక్షలు లాభం.. పూర్తి ప్లాన్ మీకోసం..

రూ.కోటి ఖరీదైన ఇంటిని ఇలా అప్పుచేసి కొంటే రూ.50 లక్షలు లాభం.. పూర్తి ప్లాన్ మీకోసం..

Buying Home: సొంత ఇల్లు కొనుక్కోవటం అనేది ప్రస్తుతం భారతదేశంలో చాలా మంది మధ్యతగరతి, ఎగువ మధ్య తరగతి ప్రజలకు ఒక కల. చాలా మంది తమ పిల్లలను చదివించటం అలాగే ఉండటానికి ఒక నివాసం ఈ రెండే భారతీయ సంస్కృతిలో దశాబ్ధాలుగా ప్రజలు కోరుకుంటున్న కనీస అవసరాలు. అయితే దీనిని ఎంత తెలివిగా ప్లాన్ చేస్తామనేదే ముఖ్యం. చాలా మంది తమ వద్ద ఉన్న మెుత్తం డబ్బు వెచ్చించి ఇల్లు కొంటుంటారు.. ఆ తర్వాత ఆర్థికంగా ఇబ్బందులనూ ఎదుర్కొంటుంటారు.

కానీ ఇప్పుడు మనం తెలుసుకోబోతున్న ఆర్థిక ప్రణాళిక సొంతింటి కలను నెరవేర్చటంతో పాటు వారికి ఆర్థికంగానూ భారీ లాభాన్ని ఆర్జించిపెడుతుంది. ఒకవేళ మీరు కోటి రూపాయలు ఖరీదైన ఇంటిని కొనుగోలు చేయాలని అనుకుంటూ దానికి పూర్తిగా డబ్బు రూపంలో చెప్పింపు చేయాలనుకుంటున్నట్లతే రూ.50 లక్షలు లాభం తెచ్చే ప్లాన్ ఇక్కడ ఉంది. దానిని ఎలా వర్కౌట్ చేయాలో ఇప్పుడు తెలుసుకోండి.

ముందుగా డౌన్ పేమెంట్ రూపంలో ఒక రూ.20 లక్షలు చెల్లించి, మిగిలిన 80 శాతం మెుత్తాన్ని బ్యాంక్ నుంచి 10 ఏళ్ల కాలానికి హోమ్ లోన్ తీసుకోవటం ఉత్తమం. ఎందుకంటే ఇటీవలి కాలంలో రిజర్వు బ్యాంక్ వడ్డీ రేట్లను తగ్గించిన తర్వాత దేశంలోని అనేక ప్రభుత్వ ప్రైవేటు బ్యాంకుల్లో గృహ రుణాలపై వడ్డీ రేట్లు 8 శాతానికి చేరాయి. అంటే రూ.80 లక్షల రుణంపై రూ.41లక్షల 60వేలతో కలిపి చివరికి మీరు రూ.కోటి 21లక్షల 60వేల వరకు బ్యాంక్ నుంచి తీసుకున్న రుణానికి చెల్లింపు చేస్తారు. అయితే ఇక్కడ లాభం ఎక్కడిది రూ.21 లక్షలు లాస్ అనుకుంటున్నారా.. అసలు కిటుకు ఇక్కడే ఉంది. 

Also Read : యూఎస్తో మధ్యంతర ఒప్పందం దిశగా భారత్

ఇక్కడ చేయాల్సిందల్లా మీ వద్ద ఉన్న రూ.80 లక్షల క్యాష్ మెుత్తాన్ని సురక్షితమైన బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసేయండి. దీనిపై కూడా 7 శాతం చొప్పున వడ్డీ వచ్చినట్లయితే డిపాజిటర్లకు హోమ్ లోన్ చెల్లించే 10 ఏళ్ల కాలంలో.. రూ.92లక్షల 71వేల వరకు వడ్డీ ఆదాయం పొందుతారు. అంటే ఇక్కడ మీ రూ.80 లక్షలు కాస్త రూ.కోటి 72లక్షల 71వేలుగా మారిపోతుంది. ఇలా చూస్తే మీరు బ్యాంక్ నుంచి రుణం తీసుకుని చేసే చెల్లింపుకు మీరు బ్యాంకులో దాచుకున్న డబ్బుపై వడ్డీతో కలిపి ఆదాయానికి ఏకంగా రూ.50 లక్షలు తేడా వస్తుంది. ఇక్కడ సొంత డబ్బుతో ఇల్లు కొనకుండా దానిని పెట్టుబడిగా పెట్టి రుణంతో ఇల్లు కొని ఈఎంఐ చెల్లించటం మీకు రూ.50 లక్షలు రాబడిని తెచ్చిపెడుతుంది.

మీరు బ్యాంకులో తీసుకున్న రుణానికి అసలుతో పాటు వడ్డీని కలిపి చెల్లిస్తుంటారు. కానీ బ్యాంకులో చేసే ఫిక్స్ డ్ డిపాజిట్లపై మెుదటి రోజు నుంచే 8 శాతం వడ్డీని అందుకుంటారు. ఇక్కడే అసలు రాబడి మ్యాజిక్ మెుదలవుతుంది. కొంచెం రిస్క్ తీసుకునే ఇన్వెస్టర్లు అయితే ఈ రూ.80 లక్షలను 12 శాతం నుంచి 20 శాతం మధ్య రాబడిని అందించే మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసినట్లయితే బ్యాంక్ ఎఫ్ డి రాబడికి మించి చివరికి పొందుతారు. ఇలా రాబడి వచ్చేలా ప్లాన్స్ చేసుకోవటం వల్ల తర్వాతి తరాలకు ఆస్తిగా ఇంటిని అందించటంతో పాటు భారీ నగదును కూడా తల్లిదండ్రులు అందించటానికి వీలుంటుంది. ఎక్కువగా ఈ ప్లాన్ లోన్ ఈఎంఐలు చెల్లించటానికి రాబడి కలిగిన.. వ్యాపారులకు, ప్రతినెల ఆదాయం వచ్చేవారికి, ఐటీ ఉద్యోగులు వంటి వారికి ఉపయోగకరంగా ఉండవచ్చు.