
హైదరాబాద్ కొండాపుర్ సీఆర్ ఫౌండేషన్ లో దాదాపు 18 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన ఓపెన్ ఎయిర్ థియేటర్ కళ క్షేత్రం,NR దాసరి పార్క్, వాకింగ్ ట్రాక్ లను నుతనంగా ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ పాల్గొని ప్రారంభించడం జరిగింది. కళక్షేత్రం ఓపెన్ ఎయిర్ థియేటర్ లో సీఆర్ ఫౌండేషన్ జరుగుతున్న కార్యక్రమాలను విక్షించారు. అంతేకాకుండా ఓపెన్ థియేటర్ కు ప్రొజెక్టర్ ను అందిస్తానని సీఆర్ ఫౌండేషన్ వారికి అరవింద్ హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఆర్ ఫౌండేషన్ రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. తన తండ్రి అల్లు రామలింగయ్య కమ్యూనిస్టు భావజాలం కలిగిన వ్యక్తి అని.. ఇక్కడి వారిని చుస్తుంటే తన పుట్టింటికి వచ్చినట్టు ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సురవరం సుధాకరరెడ్డి, సీపీఐ నారాయణ, పల్లా వేంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.