Allu Arha : సింహంపై అల్లు అర్జున్ కూతురు

Allu Arha : సింహంపై అల్లు అర్జున్ కూతురు

సమంత మెయిన్ లీడ్లో గుణశేఖర్ డైరక్షన్లో తెరకెక్కుతోన్న చిత్రం శాకుంతలం. ఫిబ్రవరి 17 న మూవీని రిలీజ్ చేయనున్నారు. మూవీ ప్రమోషన్లో భాగంగా మేకర్స్ కొద్దిసేపటి క్రితమే ట్రైలర్ రిలీజ్ చేశారు. అయితే ట్రైలర్ చివర్లో టాలీవుడ్ ఐకాన్  స్టార్ అల్లుఅర్జున్ కూతురు అల్లు అర్హ కనిపించింది. సింహంపై అర్హ కూర్చొని ఉన్నట్టుగా మేకర్స్ చూపించారు. 

ట్రైలర్లో అర్హ కనిపిస్తున్నప్పుడు ఆర్షఖండం భరత ఖండంగా మారనుంది అని డైలాగ్ వేశారు. దీంతో ఇందులో అర్హ...  భరతుని పాత్రను పోషించనుందా అన్న అనుమానులు నెలకొన్నాయి. ముందుగా అర్హ చిన్నప్పటి శకుంతలగా కనిపించనున్నట్లుగా ప్రచారం నడిచింది. మరి అర్హ ఏ క్యారెక్టర్ తో టాలీవుడ్కు ఎంట్రీ ఇవ్వనుందో చూడాలి. 

గుణశేఖర్ డైరక్షన్లో వస్తోన్న ఈ మూవీలో  శకుంతలగా సమంత నటిస్తుండగా, భరతునిగా మళయాళీ నటుడు దేవ్ మోహన్ కనిపించబోతున్నాడు. స్వరబ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. మోహన్ బాబు, దుర్వాస మహర్షి పాత్రలో కనిపించనున్నాడు. గుణ టీమ్ వర్క్స్ , దిల్ రాజు కలిసి సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీ అంచనాలే ఉన్నాయి.