జూనియర్ ఎన్టీఆర్ (NTR).. ఈ పేరుకు ప్రత్యేకమైన ఫాల్లోవింగ్ ఉంది. ఎన్టీఆర్ అనే పేరు వినబడితే చాలు .. దేశ నలుమూలలా ఉన్న ఫ్యాన్స్ కు పూనకాలు వస్తాయి. తాత ఘన వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని.. బాల నటుడిగా మొదలు.. నేటి వరకు తన సత్తా చాటుతూ వస్తున్నాడు. తాతకు తగ్గ మనవడిగా యాక్టింగ్తో అదరగొడుతున్నారు. ఈ నేపథ్యంలో తారక్ నుంచి సినిమా వస్తుందంటే చాలు అది పండగ రోజే అనేలా సంబరాలు మొదలవుతాయి. అంతేకాదు.. మే 20 వచ్చిన చాలు అది ఫ్యాన్స్ కు కనువిందే అనేలా మార్చేశాడు. ఎందుకంటే ఆరోజు ఆయన పుట్టినరోజు. 1983లో జన్మించిన ఎన్టీఆర్, ఇవాళ మే20, 2026తో 43వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు.
ఈ సందర్భంగా ఇండస్ట్రీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఎన్టీఆర్కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ఎన్టీఆర్కు X వేదికగా బర్త్ డే విషెష్ తెలిపాడు. ‘‘హ్యాపీ బర్త్‌డే తారక్ బావా. నీ జీవితంలో ఆనందం, ప్రేమ, శాంతి, ఎన్నో గొప్ప విజయాలు ఎప్పుడూ నిండుగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈసారి టైగర్ కాదు.. ఇది డ్రాగన్.. ప్రతి షాట్‌లో అగ్ని జ్వాలల్లా గర్జిస్తున్నాడు" అని ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశాడు.
Many happy returns of the day Bava @tarak9999 ! May you have abundant prosperity, peace & love .
— Allu Arjun (@alluarjun) May 20, 2026
This time it ain’t tiger
It’s DRAGON 🐉
Roaring fire every shot 🔥
స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ తనదైన శైలిలో తారక్కి శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ సింహాద్రి, యమదొంగ, టెంపర్, నాన్నకు ప్రేమతో, అరవింద సమేత, ఆర్ఆర్ఆర్.. ఇలా ఇన్ని అద్భుతమైన పాత్రలు చేసినా కూడా, నటుడిగా ఇంకా చూపించాల్సిన మరో స్థాయి తారక్‌లో మిగిలే ఉందనే భావన కలుగుతుంది. మాస్‌కి, పెర్ఫార్మెన్స్‌కి ఇంత నమ్మకంతో బ్యాలెన్స్ చేయగల నటులు చాలా అరుదు. నిజమైన పవర్‌హౌస్ పెర్ఫార్మర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇక డ్రాగన్ లో లూగర్ అవతార్ అయితే భయంకరంగా, పవర్‌ఫుల్‌గా కనిపించింది.. బెస్ట్ విషెస్ తారక్’’ అని మాటల మాంత్రికుడు విషెష్ తెలిపారు. ప్రస్తుతం వీరిద్దరి కాంబోలో ఓ మూవీ రాబోతుంది. ‘అరవింద సమేత’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
Simhadri, Yamadonga, Temper, Nannaku Prematho, Aravinda Sametha, RRR — Yet There’s Still This Feeling That He Has Another Level Left To Unlock As An Actor .. Very Few Actors Can Balance Mass & Performance With This Much Conviction .. Happy Birthday To A True Powerhouse Performer… pic.twitter.com/PXK2rvM2rk
— Trivikram (@Trivikram_Fans) May 20, 2026
మరో క్రేజీ డైరెక్టర్ శ్రీను వైట్ల విషెస్ చెబుతూ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్‌కి (NTR) జన్మదిన శుభాకాంక్షలు. ఒక గొప్ప వారసత్వాన్ని నిలబెట్టుకోవడం అంత సులభం కాదుని, ‘డ్రాగన్’ గ్లింప్స్ అద్భుతమైన మాస్ విందులా ఉందని’’ అన్నారు.
Happy Birthday to the 𝑴𝑨𝑵 𝑶𝑭 𝑴𝑨𝑺𝑺𝑬𝑺 @tarak9999 🫂
— Sreenu Vaitla (@SreenuVaitla) May 19, 2026
Living up to a legendary legacy is never easy, but you’ve carried it with grace, humility, and extraordinary talent. That itself speaks volumes about the person you are ❤️#Dragon glimpse was an absolute mass feast 🔥… pic.twitter.com/qT1jUDP3EN
‘‘నా అత్యంత ప్రియమైన, నాకు ఎంతో ఇష్టమైన ఎన్టీఆర్కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. నీ జీవితంలో ఆనందం, విజయాలు, మంచి ఆరోగ్యం ఎల్లప్పుడూ నిండుగా ఉండాలని కోరుకుంటున్నాను. దేవుడు నిన్ను ఎప్పుడూ అపారమైన ఆశీర్వాదాలతో కాపాడాలని ప్రార్థిస్తున్నాను. లవ్ యూ కన్నా!! నా హీరో... నా తారక్.. నా డ్రాగన్.. అని సీనియర్ స్టార్ హీరోయిన్ ’’ ఖుష్బూ క్యూట్ విషెస్ తెలిపారు.
A very very happy birthday to my dearest and most fav @tarak9999 . Sending you tons and tons of best wishes for happiness, success and good health. May God always bless you in abundance. Love you Kanna !!
— KhushbuSundar (@khushsundar) May 20, 2026
My Hero, My Tarak, My Dragon. 🫶♥️💖🫶♥️💖🫶♥️💖#HBDTarak #JrNTR… pic.twitter.com/KW2SCG6YQn
‘‘హ్యాపీ బర్త్‌డే డియర్ తారక్. హద్దులు దాటి అభిమానాన్ని సంపాదించిన ఓ శక్తి… ఇప్పుడు మరింత భీకరమైన ప్రపంచంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. డ్రాగన్ గ్లింప్స్ అదిరిపోయింది. ప్రశాంత్ నీల్ అంటేనే ఫైర్. ఇప్పుడు ఇక డ్రాగన్లో పిచ్చి మాస్, ఎమోషన్, కోపం, ఆరా అన్నీ కలిసి స్క్రీన్‌ను మండించేలా ఉన్నాయి. ఈ లూగర్ తుఫాన్ ఎలా విరుచుకుపడుతుందో చూడటానికి ఇక ఆగలేకపోతున్నాం ’’ అని గోపీచంద్ మలినేని శుభాకాంక్షలు తెలిపారు.
Happiest Birthday to our dearest @tarak9999 garu ❤️
— Gopichandh Malineni (@megopichand) May 19, 2026
A force celebrated beyond boundaries. And now… arriving with a world that looks absolutely monstrous ❤️❤️❤️#PrashanthNeel IS JUST 🔥
#DragonGlimpse has all the madness, emotion, rage and aura to set the atmosphere on fire…
