జాతీయ అవార్డు కొట్టేశాడమ్మా.. తొలి తెలుగు హీరోగా అల్లు అర్జున్ రికార్డ్

జాతీయ అవార్డు కొట్టేశాడమ్మా.. తొలి తెలుగు హీరోగా అల్లు అర్జున్ రికార్డ్

తెలుగు హీరోలకు జాతీయ అవార్డులు రావా.. మన తెలుగు హీరోలు జాతీయ ఉత్తమ నటులు కారా.. 70 ఏళ్లుగా ఉన్న ప్రశ్నకు ఇప్పుడు సమాధానం దొరికేసింది. వచ్చాడమ్మా పుష్పా.. కొట్టాడమ్మా జాతీయ ఉత్తమ నటుడి అవార్డు అంటోంది తెలుగు సినిమా ఇండస్ట్రీ. ఇన్నాళ్లు తీరని కలగా ఉన్న తెలుగు ఇండస్ట్రీకి.. ఇప్పుడు ఆ లోటు కూడా తీర్చేశారు పుష్ప.. అల్లు అర్జున్.. తగ్గేదేలా అని ఏ ముహూర్తాన డైలాగ్ అన్నాడో అల్లు అర్జున్.. అందుకు తగ్గట్టుగానే పుష్ప మూవీ సూపర్ డూపర్ మూవీ హిట్ అయ్యింది.. కలెక్షన్ల సునామీ సృష్టించింది.. అంతకు మించి.. తగ్గేదేలా అంటూ జాతీయ ఉత్తమ నటుడి కిరీటాన్ని దక్కించుకున్నాడు అల్లు అర్జున్. ఇండస్ట్రీలోనే తగ్గేదేలా అమ్మా అంటూ ఐకాన్ స్టార్ గా మరోసారి నిరూపించుకున్నారు అల్లు అర్జున్..

69 సంవత్సరాల సినీ చరిత్రలో ఇప్పటివరకు ఏ తెలుగు హీరో కూడా జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు రాలేదు. ఇప్పుడు ఆ ఘనతను సొంతం చేసుకున్నాడు అల్లు అర్జున్. ఆయన హీరోగా వచ్చిన పుష్ప సినిమాకు గాను ఆయన ఈ ప్రతిష్టాత్మక అవార్డు అందుకున్నాడు. సౌత్ లో కమల్ హాసన్ లాంటి హీరోలు తప్ప ఇప్పటివరకు ఏ హీరో కు కూడా ఈ ఘనత దక్కలేదు. తఇక తెలుగు హీరోల గురించి అయితే ఎంత తక్కువ చెప్పుకుంటే అంత బెటర్. ఇక్కడ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి స్టార్ హీరోలు ఉన్నా వారికి ఆ ఘనత దక్కలేదు. నాగార్జున నటించిన అన్నమయ్య సినిమాకు గాను ఆయన అవార్డ్స్ అందుకుంటారు అనుకున్నారు కానీ ఆయనకు ఆ అవార్డు దక్కలేదు. ఇక ఇప్పుడు పుష్ప సినిమాతో అల్లు అర్జున్ ఆ కీర్తిని దక్కించుకున్నాడు. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఇక పుష్ప సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమాలో అద్భుతమైన నటనను కనబరిచారు అల్లు అర్జున్. ఎర్రచందనం స్మగ్లర్ బ్యాక్డ్రాప్ లో వచ్చిన ఈ సినిమాలో పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్ నటనకు దేశ వ్యాప్తంగా ప్రశంసలు దక్కాయి. నార్త్ ఆడియన్స్ సైతం ఈ సినిమాను చూసేందుకు ఎగబడ్డారు. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ డాన్స్, డైలాగ్స్ కు ఆడియన్స్ ఫిదా అయిపోయారు.

ఇక బన్నీ చెప్పిన తగ్గేదే లే అనే డైలాగ్ అయితే యావత్ ప్రపంచాన్ని ఉర్రూతలూగించింది. సెలబ్రెటీస్, క్రికెటర్స్ అని తేడా లేకుండా తెగ వాడేసాడు ఈ డైలాగ్ ను. అందుకే 2023 జాతీయ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ ఎప్పికయ్యి రికార్డ్ క్రియేట్ చేసాడు.