Daksha: మంచు వారి యాక్షన్, క్రైమ్ థ్రిల్లర్‌.. 'దక్ష'తో రఫ్పాడించిన మోహన్ బాబు, లక్ష్మీ

Daksha: మంచు వారి యాక్షన్, క్రైమ్ థ్రిల్లర్‌.. 'దక్ష'తో రఫ్పాడించిన మోహన్ బాబు, లక్ష్మీ

కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు ప్యామిలీ నుంచి ఇటీవల వచ్చిన చిత్రం 'కన్నప్ప' .  భారీ తారగణంతో తెరకెక్కించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అశించిన స్థాయిలో విజయం సాధించేలేకపోయింది. ఇప్పుడు మరో సినిమా రెడీ అయింది. ఈసారి మోహన్ బాబు, లక్మీ ప్రధాన ప్రాతలో నటించిన చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సుమారు ఐదేళ్ల తర్వాత మంచు లక్ష్మీ వెండితెరపైకి రీ ఎంట్రీ ఇచ్చింది.  

మోహన్ బాబు సొంత బ్యానర్ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ పై 'దక్ష (ది డెడ్లీ కాన్సిపరెసీ)' మూవీని  నిర్మించారు. నిర్మాతలుగా డాక్టర్ మోహన్ బాబు, మంచు లక్ష్మి వ్యవహరిస్తున్నారు.  ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లాంచ్ చేశారు.  ఈ సందర్భంగా ఒకే తెరపై మోహన్ బాబు, లక్ష్మీ కనింపచడం చాలా ఆనందంగా ఉందన్నారు.  ఈ సినిమా అఖండ విజయం సాధించాలని కోరుకుంటున్నాను. దర్శకుడికి శుభాకాంక్షలు అని అల్లు అర్జున్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.

 

యాక్షన్, క్రైమ్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ చిత్రానికి దర్శకుడిగా వంశీకృష్ణ మల్ల వ్యవహరించారు. ట్రైలర్ లో మంచు లక్ష్మి ఒక పవర్ ఫుల్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ పాత్రలో కనిపించారు. ఆమె లుక్స్, బాడీ లాంగ్వేజ్ చాలా కొత్తగా, ఆకట్టుకునేలా ఉన్నాయి. హై-ఆక్టేన్ యాక్షన్ సీన్స్ లో ఆమె తన విశ్వరూపం చూపించింది. ఈ సినిమాలో ఎమోషన్, యాక్షన్, సస్పెన్స్ అన్నీ సమపాళ్లలో ఉన్నాయని ట్రైలర్ చూస్తేనే స్పష్టం చేస్తోంది.

మంచు లక్ష్మీ ఈ చిత్రాన్ని సుమారు నాలుగేళ్ల క్రితమే 'అగ్ని నక్షత్రం' అనే టైటిల్‌తో ప్రకటించారు. అయితే, ఇప్పుడు అదే సినిమాను 'దక్ష'గా మార్చి విడుదల చేస్తున్నారు. ఈ సినిమాలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, లక్ష్మీతో పాటు  మలయాళ నటుడు సిద్ధిక్, ప్రముఖ నటులు సముద్రఖని, చైత్ర శుక్ల వంటి వారు ముఖ్య పాత్రలు పోషించారు. లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ నుంచి దాదాపు పదేళ్ల తర్వాత విడుదల కానున్న చిత్రం ఇది. ఈ బ్యానర్‌ నుంచి చివరిసారిగా 2015లో 'మామ మంచు అల్లుడు కంచు' చిత్రం విడుదలైంది. టీజర్‌తోనే అంచనాలు పెంచిన 'దక్ష' చిత్రం సెప్టెంబర్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.