‘దాక్కో దాక్కో మేక.. పులొచ్చి కొరుకుద్ది పీక’

V6 Velugu Posted on Aug 03, 2021

కొన్ని కాంబినేషన్స్ సెట్టవ్వగానే హిట్ గ్యారంటీ అనే నమ్మకం వచ్చేస్తుంది. అల్లు అర్జున్, సుకుమార్‌‌‌‌ల కాంబినేషన్‌‌పై ప్రేక్షకులకు అలాంటి నమ్మకమే ఉంది. ఈ ఇద్దరికీ మరొకరు తోడయితే ఇక ఆ స్పీడుకు బ్రేకులు వేయడం కష్టం. అతనే సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్. ఈ ముగ్గురూ కలిసి ప్రస్తుతం ‘పుష్ప’ సినిమా చేస్తున్నారు. నిన్న దేవిశ్రీ పుట్టినరోజు సందర్భంగా విషెస్ చెబుతూ ఈ మూవీ ఫస్ట్ సాంగ్ లాంచ్ అప్‌‌డేట్‌‌తో పాటు పాట పల్లవిని కూడా కొంత వినిపించారు. ‘దాక్కో దాక్కో మేక.. పులొచ్చి కొరుకుద్ది పీక’ అనే పల్లవితో సాగే ఈ పాటని ఆగస్టు 13న విడుదల చేయబోతున్నట్టు అనౌన్స్ చేశారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లోనూ సాంగ్​ని రిలీజ్ చేయ‌‌నున్నారు. తెలుగులో శివం, తమిళంలో బెన్నీ దయాల్, కన్నడలో విజయ్ ప్రకాష్, మలయాళంలో రాహుల్ నంబియార్, హిందీలో విశాల్ దడ్లాని పాడారు. ట్యూన్ వింటుంటే ఎంతో జోష్‌‌ఫుల్‌‌గా అనిపిస్తోంది. ఈ ముగ్గురి కాంబినేషన్‌‌లో వచ్చిన ఆర్య, ఆర్య2 చిత్రాలు మ్యూజికల్​గా మంచి హిట్టయ్యాయి. దీంతో ‘పుష్ప’ ఆడియోపై అంచనాలు ఓ రేంజ్‌‌లో ఉన్నాయి. బన్నీకి జంటగా రష్మిక మందాన్న నటిస్తున్న ఈ చిత్రంలో పహాద్ ఫాజిల్ విలన్. నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్నారు.

Tagged allu arjun, Pushpa movie, Director Sukumar, pushpa, Rashmika Mandanna, Devi sriprasad

Latest Videos

Subscribe Now

More News