
బ్యూటీ రష్మిక మందన్న, హీరో అల్లు అర్జున్కు స్పెషల్ గిఫ్ట్తో సర్ప్రైజ్ చేసింది. రష్మిక పంపిన బహుమతికి ఫిదా అయ్యారు బన్నీ. ఈ తరుణంలో స్పెషల్ నోట్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. మరి రష్మిక పంపిన ఆ స్పెషల్ గిఫ్ట్ ఏంటనే వివరాల్లోకి వెళితే..
రష్మిక ఇటీవల ‘డియర్ డైరీ’అనే పెర్ఫ్యూమ్ బ్రాండ్‌ను ప్రారంభించింది. ఇప్పటికే, ఓ మూడు ఫ్లేవర్స్ను మార్కెట్లోకి ఇంట్రడ్యూస్ చేసింది. ఈ క్రమంలో డియర్ డైరీ బ్రాండ్ ప్రమోషన్స్లో భాగంగా టాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రిటీలందరికీ ఈ స్పెషల్ గిఫ్ట్స్ పంపిస్తుంది.
ఈ సందర్భంగా బన్నీకు కూడా తన బ్రాండ్కి సంబంధించిన కొన్నిపెర్ఫ్యూమ్ లను పంపింది. ఈ క్రేజీ బహుమతిని అందుకున్న అల్లు అర్జున్, తన ఇంస్టాగ్రామ్ వేదికగా పోస్ట్ పెట్టారు. 'థ్యాంక్యూ సో మచ్ మై డియర్ రష్.. నీ కొత్త ప్రయాణానికి ఆల్ ది బెస్ట్.. నీకు ఎప్పుడూ మంచి జరగాలని కోరుకుంటాన్నానంటూ' అంటూ నోట్ రాశారు.
అయితే బన్నీపెట్టిన పోస్ట్కు రష్మిక రిప్లై ఇస్తూ.. థ్యాంక్యూ చెప్పారు. ‘థ్యాంక్యూ సర్ర్ర్, ఇది నాకు చాలా స్పెషల్. మనం త్వరలో కలుద్దాం అని ఆశిస్తున్నాను’అని రష్మిక స్పందించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీరిద్దరి ఇన్స్టా స్టోరీలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలానే, రష్మిక తన బ్రాండ్స్ను, డైరెక్టర్ సుకుమార్ భార్య తబితకు కూడా పంపింది. విత్ లవ్ ఫ్రమ్ అక్క అంటూ తబిత ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ చిన్న నోట్ రాసింది.
రష్మిక మందన్న లాంచ్ చేసిన ‘డియర్ డైరీ’ఇప్పుడిప్పుడే మార్కెట్లోకి దర్శనమిస్తుంది. ప్రస్తుతం ఇందులో ఓ మూడు ఫ్లేవర్స్ ఉన్నట్లు సమాచారం. వాటిలో నేష్నల్ క్రష్ (National Crush), ఇర్రిప్లేసెబుల్ (Irreplaceable), కాంట్రవర్సియల్ (Controversial) అనే మూడు వెరైటీ సెంట్ బాటిల్స్ అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది. 100ml,10mlలో ఉన్న ఈ పెర్ఫ్యూమ్స్ ఆన్లైన్లో సైతం అందుబాటులో ఉన్నాయి.
ప్రస్తుతం రష్మిక, అల్లు అర్జున్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. రష్మిక త్వరలో రొమాంటిక్ ఎంటర్టైనర్ 'ది గర్ల్ ఫ్రెండ్' తో ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే, ఆయుష్మాన్ ఖురానాతో 'థామా' అనే హారర్ కామెడీతో పాటు 'మైసా' అనే మూవీలో నటిస్తుంది.
అల్లు అర్జున్.. పుష్ప 2 త్వరిత అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఇది సైన్స్ ఫిక్షన్ జానర్ లో తెరకెక్కుతుంది. AA22XA6 అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఇకపోతే అల్లు అర్జున్,రష్మిక తమ వరుస సినిమాల తర్వాత పుష్ప ఫ్రాంచైజీలో రానున్న పుష్ప 3 రాంపేజ్ లో నటించనున్నారు. ఈ ప్రాజెక్ట్ 2027లో స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది.
Sirrrrr! Let’s kill it with this one! I am so excited!❤️
— Rashmika Mandanna (@iamRashmika) June 27, 2025
Thaaaaankyou for the constant support ❤️ https://t.co/5X7SxnBNvX