Allu Arjun: ‘చిన్న బాబు’కి నా ప్రేమ.. అల్లు అర్జున్ ఎమోషనల్ ట్వీట్.. అయాన్ గ్రాండ్ ఎంట్రీ కన్ఫామా?

Allu Arjun: ‘చిన్న బాబు’కి నా ప్రేమ.. అల్లు అర్జున్ ఎమోషనల్ ట్వీట్.. అయాన్ గ్రాండ్ ఎంట్రీ కన్ఫామా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు. ఏప్రిల్ 3, 2026న, అల్లు అర్జున్ తనయుడు అయాన్ 12వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు.

ఈ సందర్భంగా, అల్లు అర్జున్ ట్విట్టర్ మరియు ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో అయాన్ ఫోటోను పోస్ట్ చేసి బర్త్ డే విషెస్ అందించారు. “నా జీవితపు ప్రేమకు పుట్టినరోజు శుభాకాంక్షలు.. హ్యాపీ బర్త్‌డే మై చిన్నీ బాబు #అల్లుఅయాన్” అంటూ ప్రేమతో అభినందనలు తెలిపారు. ఈ పోస్టుపై అల్లు ఫ్యాన్స్ స్పందిస్తూ అయాన్‌కు విషెస్ అందిస్తున్నారు. అయాన్ 2014 ఏప్రిల్ 3న జన్మించిన విషయం తెలిసిందే.

అయాన్ ఎంట్రీ:

ఈ 2026 ఏడాది అల్లు అయాన్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా సినీ వర్గాల్లో టాక్. ముఖ్యంగా సోషల్ మీడియాలో తండ్రిలా, అయాన్‌కు కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. గతంలో రామ్ చరణ్ (Ram Charan) రంగస్ధలంలోని డైలుగులు చెబుతూ చేసిన రీల్స్ వైరల్ అయ్యాయి.

అదేవిధంగా, రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది (Peddi) సినిమాలో అల్లు అయాన్ చిన్నపాటి గెస్ట్ రోల్ చేయనున్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.

అల్లు అర్జున్ లైనప్

ప్రస్తుతం అల్లు అర్జున్ చేతిలో ఉన్న ప్రాజెక్టులు చూస్తుంటే ఆయన బాక్సాఫీస్ వద్ద మరోసారి రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో 'AA22' మూవీ షూటింగ్ దశలో ఉంది. ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ 2026 నవంబర్‌లో వచ్చే అవకాశం ఉంది.

ఇక  'AA23 ' చిత్రానికి లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేస్తున్నారు. రీసెంట్‌గా విడుదలైన టీజర్ వీడియోతో అంచనాలు పెంచేసింది. ఈ చిత్రం 2026 జూన్, జూలైలో సెట్స్ పైకి వెళ్లనుంది.

మరో వైపు సందీప్ రెడ్డి వంగా ప్రాజెక్ట్ ఒకటి చర్చల దశలో ఉంది. ఆదిత్య ధర్, అల్లు అర్జున్ భారీ యాక్షన్ మూవీపై మరిన్ని అప్‌డేట్స్ కోసం ఫ్యాన్స్ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.