
మెగా హీరో అల్లు శిరీష్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ టెడ్డీ. ఈ సినిమా అఫీషియల్ అనౌన్స్మెంట్ మే 30న రానుంది. దీనికి సంబంధించిన ప్రీ లుక్ ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్. అయితే ఈ ప్రీ లుక్ చూసిన చాలా మంది.. ఈ పోస్టర్ ను ఇంతకుముందే వచ్చిన రెండు సినిమాలతో పోలిస్తున్నారు.
అందులో ఒకటి తమిళ హీరో ఆర్య, సాయేషా సైగల్ జంటగా వచ్చిన టెడ్డీ మూవీ. ఇదొక సూపర్ నాచురల్ మూవీ. ఈ మూవీలో కోమాలో ఉన్న హీరోయిన్ ఆత్మ ఒక టెడ్డీ బియర్ లోకి ప్రవేశించి హీరో ద్వారా తన ప్రాణాలను ఎలా కాపాడుకుంటుంది అనేది చూపించాడు. ఈ సినిమా ఇప్పటికే ఓటీటీలో అందుబాటులో ఉంది.
ఇక రెండవది సందీప కిషన్ హీరోగా నెట్ ఫ్లిక్స్ అనౌన్స్ చేసిన బడ్డీ మూవీ. 2023 సంక్రాంతి సందర్భంగా నెట్‌ఫ్లిక్స్ తమ కంటెంట్ క్యాలెండర్‌ను విడుదల చేసింది. అందులో సందీప్ కిషన్ హీరోగా ‘బడ్డీ’ సినిమాను ప్రకటించారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ ను కూడా రిలీజ్ చేసింది. మైఖేల్ మూవీ తరువాత బడ్డీ సినిమా వస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ఏమైందో తెలీదు కానీ ఆ సినిమా ఆగిపోయిందని సమాచారం.
ఇప్పుడు అదే సినిమాను అల్లు శిరీష్ తో తీస్తున్నారనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. మరి ఈ సినిమా ఆర్య హీరోగా వచ్చిన సినిమాకి రీమేక్ గా వస్తుందా.. లేక కొత్త కాన్సెప్ట్ తీసుకుంటున్నారా అనేది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా అల్లు శిరీష్ టెడ్డీ మూవీ ఫస్ట్ లుక్ చాలా మంది ఇది ఖచ్చితంగా తమిళ టెడ్డీ మూవీకి రిమేకే అని కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇది రీమేకా లేక కొత్త కథానా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.