ఐసీసీ హాల్​ ఆఫ్​ ఫేమ్‌‌లో సెహ్వాగ్, ఎడుల్జీ

ఐసీసీ హాల్​ ఆఫ్​ ఫేమ్‌‌లో సెహ్వాగ్, ఎడుల్జీ

దుబాయ్: ఇండియా విమెన్స్ క్రికెట్ టీమ్‌‌ మాజీ కెప్టెన్ డయానా ఎడుల్జీ అరుదైన రికార్డు సృష్టించింది. ఐసీసీ హాల్ ఆఫ్​ ఫేమ్‌‌లో చోటు దక్కించుకున్న ఇండియా తొలి మహిళా క్రికెటర్‌‌‌‌గా నిలిచింది. ఎడుల్జీతో పాటు వరల్డ్ కప్ విన్నింగ్ ప్లేయర్లు వీరేందర్ సెహ్వాగ్, అరవింద డిసిల్వ (శ్రీలంక)ను ఐసీసీ హాల్ ఆఫ్​ ఫేమ్‌‌లో చేర్చింది. తమ కెరీర్‌‌‌‌లో సాధించిన అద్భుత ఘనతలకు గాను ముగ్గురికీ ఈ గౌరవం లభించింది.  

టీమ్‌‌ కెప్టెన్‌‌గానే కాకుండా అడ్మినిస్ట్రేటర్‌‌‌‌గానూ డయానా విమెన్స్‌‌ క్రికెట్‌‌పై తనదైన ముద్ర వేసింది. 1976 నుంచి 1993 వరు అన్ని ఫార్మాట్లలో కలిసి 54 మ్యాచ్‌‌లు ఆడిన లెఫ్టార్మ్‌‌ స్పిన్నర్‌‌‌‌ ఎడుల్జీ వంద పైచిలుకు వికెట్లు పడగొట్టింది. మరోవైపు మోడర్న్‌‌ క్రికెట్‌‌లో విధ్వంసకర ఓపెనర్‌‌‌‌గా పేరు తెచ్చుకున్న సెహ్వాగ్ తన మెరుపు  బ్యాటింగ్‌‌తో టెస్టు, వన్డేలకు కొత్త కళ తీసుకొచ్చాడు.