ఆదివారం యాదాద్రికి పోటెత్తిన భక్తులు

ఆదివారం యాదాద్రికి పోటెత్తిన భక్తులు

యాదాద్రి,వెలుగు:యాదగిరిగుట్ట పట్టణంతోపాటు కొండపై ఆదివారం తీవ్ర రద్దీ నెలకొంది. లక్ష్మీ పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు కొండపైకి చేరుకొని స్వామివారిని దర్శించుకోవడానికి క్యూ లైన్లలో బారులు తీరారు. పెద్దఎత్తున వెహికల్స్​కొండపైకి చేరుకోవడంతో రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. లక్ష్మీ నర్సింహస్వామిని హైకోర్టు జడ్జి జస్టిస్​ వెంకటేశ్వర రెడ్డి దంపతులు దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

స్వామివారి పల్లకీ సేవలో పాల్గొన్నారు. భక్తుల రద్దీ కారణంగా ఆదివారం స్వామివారికి రూ. 47,71,692 ఆదాయం సమకూరింది. ఇందులో ప్రసాద విక్రయం ద్వారా రూ. 23.60 లక్షలు, వెహికల్స్​ పార్కింగ్​ద్వారా రూ. 5 లక్షల ఆదాయం సమకూరింది.