పాల్వంచ, వెలుగు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పూర్వవిద్యార్థుల ఆధ్వర్యంలో జిమ్ ఏర్పాటు చేశారు. ఈ జిమ్‌ను రిటైర్డ్ ప్రిన్సిపాల్ వంకదారు నరసింహకుమార్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పూర్వవిద్యార్థుల సంఘం అధ్యక్షుడు పసునూరి రమేశ్ మాట్లాడుతూ తాము చదువుకున్న కళాశాల అభివృద్ధికి పూర్వవిద్యార్థులు సహకరించడం అభినందనీయమన్నారు.
గతంలో 2.50 లక్షలతో స్కూటర్ స్టాండ్, రూ.1.08 లక్షలతో ఫర్నిచర్ అందజేసినట్లు గుర్తుచేశారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ పద్మ, పూర్వవిద్యార్థుల సంఘం మాజీ అధ్యక్షుడు, న్యాయవాది ఎర్రపాటి కృష్ణ, వెంకట్, నాగేశ్వరరావు, కె.విజయ్, కె.రాంబాబు, కృష్ణ పాల్గొన్నారు.
