ఆమనగల్లు వ్యవసాయ మార్కెట్​ యార్డులో అన్నదానం

ఆమనగల్లు వ్యవసాయ మార్కెట్​ యార్డులో అన్నదానం

ఆమనగల్లు, వెలుగు: ఆమనగల్లు వ్యవసాయ మార్కెట్  యార్డు ఆవరణలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రానికి వచ్చే రైతులకు ఉచితంగా భోజనం అందిస్తున్నట్లు ఏఎంసీ చైర్ పర్సన్  గీత నరసింహ తెలిపారు. సోమవారం ఆమె మార్కెట్  ఆవరణలో అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. 

కొనుగోలు కేంద్రానికి వడ్లు తీసుకువచ్చిన రైతులు భోజనం కోసం ఇబ్బందులు పడవద్దనే ఉద్దేశంతో అన్నదానం ఏర్పాటు చేశామని చెప్పారు. వైస్  చైర్మన్  భాస్కర్ రెడ్డి, డైరెక్టర్లు వస్పుల శ్రీశైలం, అంజయ్య గుప్తా, నరేశ్ నాయక్, గుర్రం కేశవులు, జగన్, సత్యం, శ్రీకాంత్, కాలె మల్లయ్య, నాజర్  పాల్గొన్నారు.