
మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) హీరోగా తెరకెక్కుతున్న మూవీ భోళాశంకర్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. మూవీ రిలీజ్ కు తేదీలు దగ్గరపతున్నాయి. ఈ సినిమాలో చిరు సరసన మిల్కీ బ్యూటీ తమన్నా(Tamannaah) నటిస్తున్న విషయం తెలిసిందే.
ఇప్పటికే ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయ్యింది. పాటలను విడుదల చేస్తూ హైప్ క్రియేట్ చేస్తున్న విషయం తెలిసిందే. కానీ ఈ మూవీ వేదాళం మూవీకి రీమేక్ అన్న విషయం తెలిసిందే. రీమేక్ అనగానే ఫ్యాన్స్ చాలా భయపడ్డారు. మక్కీటూ మక్కీ దింపి ఉంటారని కొందరు భావిస్తున్నారు.
ఈ విషయంపై తాజాగా మిల్కీ బ్యూటీ స్పందించింది. భోళాశంకర్ సినిమా వేదాళం మూవీకి రీమేక్ మాత్రమే.. సీన్ టు సీన్ కాపీ చేయలేదు. దర్శకుడు మెహర్ రమేశ్ ఈ మూవీని రీ క్రియేట్ చేశారు. వేదాళం చూసిన అనుభూతి అసలే కలుగదు. తెలుగు ప్రేక్షకులకు నచ్చేలా తెరకెక్కించారు..అని తమన్నా చెప్పింది. దీంతో మెగా అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.