తిరుపతిలో అమర రాజా బ్యాటరీ రీసెర్చ్​ హబ్‌‌

తిరుపతిలో అమర రాజా బ్యాటరీ రీసెర్చ్​ హబ్‌‌

హైదరాబాద్‌‌: వెహికల్ బ్యాటరీలను తయారు చేసే అమర రాజా బ్యాటరీస్‌‌ తిరుపతిలో టెక్నాలజీ హబ్‌‌ను ఏర్పాటు చేయనుంది. లిథియం ఆయాన్ సెల్స్‌‌ను ఈ సెంటర్‌‌‌‌లో డెవలప్‌‌ చేస్తారు. ఇండియన్ ప్రైవేట్ సెక్టార్‌‌‌‌లో  మొదటి లిథియం అయాన్ సెల్‌‌ మాన్యుఫాక్చరింగ్ ఫెసిలిటీ ఇదేనని అమర రాజా బ్యాటరీస్‌‌ సీఈఓ ఎస్‌‌ విజయానంద్‌‌ అన్నారు. టెక్నాలజీ ట్రాన్స్‌‌ఫర్‌‌‌‌ అగ్రిమెంట్‌‌ను ఇండియన్ స్పేస్‌‌ రీసెర్చ్ ఆర్గనైజేషన్‌‌(ఇస్రో)తో 2019 ప్రారంభంలోనే కుదుర్చుకున్నామని చెప్పారు. ఈ హబ్‌‌ కోసం రూ. 20 కోట్లను ఇప్పటికే ఇన్వెస్ట్ చేశామని అన్నారు. ఇందులో ఇస్రోకి చెల్లించిన టెక్నాలజీ ట్రాన్స్‌‌ఫర్‌‌‌‌, బిడ్డింగ్‌‌లు ఫీజులు అదనమని పేర్కొన్నారు.

ఎటువంటి రాయల్టీ   లేకుండానే ఇస్రో నుంచి లిథియం అయాన్ సెల్‌‌ టెక్నాలజీ తీసుకోవడానికి అగ్రిమెంట్‌‌ కుదుర్చుకున్నామని విజయనంద్‌‌ అన్నారు. టెక్నాలజీ లైసెన్స్‌‌ పొందిన కంపెనీలు బిడ్డింగ్‌‌ ఫీజు, టెక్నాలజీ ట్రాన్స్‌‌ఫర్‌‌‌‌ ఫీజును చెల్లిస్తే సరిపోతుంది. ఇప్పటీకే ఈ ఫీజులను ఇస్రోకి చెల్లించామని అమర రాజా తెలిపింది. మరో పదేళ్ల వరకు యాసిడ్ బేస్డ్ బ్యాటరీలే మార్కెట్‌‌ను ఏలుతాయని విజయానంద్ అభిప్రాయపడ్డారు. ఎలక్ట్రిక్‌‌ వెహికల్స్‌‌లో వాడే లిథియం ఆయాన్ బ్యాటరీలు విస్తరించడానికి టైమ్‌‌ పడుతుందని తెలిపారు. ప్రస్తుతం ఈవీ తయారీ కంపెనీలు బ్యాటరీలను ఎక్కువగా చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నాయి.