
హైదరాబాద్, వెలుగు: అమర రాజా ఎనర్జీ అండ్ మొబిలిటీ లిమిటెడ్‌కు డిసెంబర్‌తో ముగిసిన క్వార్టర్‌లో రూ.2,881.06 కోట్ల రెవెన్యూ (ఆపరేషన్స్) , రూ.313.32 కోట్ల ప్రాఫిట్ (ట్యాక్స్ ముందు) వచ్చింది. అంతకు ముందు ఏడాది క్యూ3 లో రూ.2,637.24 కోట్ల రెవెన్యూ, రూ.302.57 కోట్ల ప్రాఫిట్ (ట్యాక్స్ ముందు) ప్రకటించింది.
ఆటోమోటివ్ బ్యాటరీ బిజినెస్‌లో ఎగుమతులు పెరిగాయని, డొమెస్టిక్ మార్కెట్‌లో సేల్స్ ఊపందుకున్నాయని కంపెనీ పేర్కొంది. టెలికం సెక్టార్ వృద్ధి చెందడంతో బ్యాటరీ బిజినెస్‌కు డిమాండ్ పెరిగిందని తెలిపింది. న్యూ ఎనర్జీ బిజినెస్ కింద టెలికం సెక్టార్‌కు బ్యాటరీలు సప్లయ్ చేస్తున్నామని వెల్లడించింది.