సన్‌‌‌‌ఛార్జ్‌‌‌‌ నీళ్లు ఎంతో మేలు

సన్‌‌‌‌ఛార్జ్‌‌‌‌ నీళ్లు ఎంతో మేలు

సూర్యరశ్మి వల్ల విటమిన్– డి దొరుకుతుందని సన్‌‌‌‌ బాత్‌‌‌‌ చేస్తుంటారు. అదొక్కటే కాదు, సూర్యరశ్మిలో ఉంచిన నీళ్లు యాంటీ వైరల్, యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్‌‌‌‌గా పనిచేస్తాయట. వీటిని సన్‌‌‌‌ ఛార్జ్ వాటర్ అంటారు. ఆ నీళ్లు తాగితే అనారోగ్య, చర్మ సమస్యలు దూరమవుతాయి. ఈ ప్రాసెస్‌‌‌‌ను ఆయుర్వేదంలో ‘సూర్య జల్‌‌‌‌ చికిత్స’ అంటారు.

సన్ ఛార్జ్ వాటర్ తాగితే రోజులో కావాల్సిన ఎనర్జీ వస్తుంది. దద్దుర్లు, ఎలర్జీ లాంటి స్కిన్‌‌‌‌ ప్రాబ్లమ్స్‌‌‌‌ రావు. డ్యామేజ్‌‌‌‌ అయిన చర్మ కణాలు రిపేర్ అవుతాయి. దాంతో చర్మం ప్రకాశవంతంగా మారుతుంది.  ఈ నీళ్లలోని యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు కంటి సమస్యను దూరం చేస్తాయి. కండ్లకలక, కనుగుడ్డు నొప్పి ఉన్నవాళ్లు ఈ నీళ్లతో కడుక్కోవడం వల్ల కొంత ఉపశమనం దొరుకుతుంది.  

సన్‌‌‌‌ ఛార్జ్‌‌‌‌ వాటర్‌‌‌‌‌‌‌‌ గుండెలో మంటలు, అల్సర్‌‌‌‌‌‌‌‌లను పోగొడతాయి. జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తాయి. ఎముకల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. సన్‌‌‌‌ ఛార్జ్‌‌‌‌ నీళ్లను ఎలా తయారు చేయాలంటే... రాగి, గాజు లేదా ఏదైనా మెటల్‌‌‌‌లో పాత్రలో నీళ్లు తీసుకోవాలి. ఆ నీళ్లను ఎనిమిది గంటల పాటు ఎండలో ఉంచి, ఆ తరువాత తాగాలి. ఎండలో ఉంచిన నీళ్లను ఫ్రిజ్‌‌‌‌లో పెట్టొద్దు. అలా చేస్తే నీళ్లకు వచ్చిన హెల్త్‌‌‌‌ ప్రాపర్టీస్‌‌‌‌ అన్నీ పోతాయి. అంతేకాదు.. నీళ్లు ప్లాస్టిక్‌‌‌‌ గిన్నెల్లో పోసి ఎండకు అస్సలు పెట్టొద్దు.  ఎండకు ప్లాస్టిక్ కరిగి నీళ్లలో కలిసే అవకాశం ఉంటుంది. అది ఆరోగ్యానికి మంచిది కాదు.