Amazon :  అమెజాన్ లో 9వేల మంది ఉద్యోగుల తొలగింపు

Amazon :  అమెజాన్ లో 9వేల మంది ఉద్యోగుల తొలగింపు

అమెజాన్.. అమెజాన్.. ఇప్పుడు బిగ్ షాక్ ఇచ్చింది. తొమ్మిది వేల మంది ఉద్యోగులను పీకేసింది. కంపెనీ కష్టాల్లో ఉందని.. ఆర్థిక స్థిరత్వం కోసం.. కంపెనీ భవిష్యత్ కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు సీఈవో ఆండీ జెస్సీ. అమెజాన్ లో ఉద్యోగుల తొలగింపు ఇది రెండోసారి. 2022, నవంబర్ నెలలో ప్రపంచ వ్యాప్తంగా అమెజాన్ స్టోర్స్ లో 18 వేల మందిని తొలగించింది కంపెనీ. సెకండ్ రౌండ్ కింద.. 2023, మార్చి 20వ తేదీన మరో 9 వేల మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించటం.. ఐటీ రంగంలో సంచలనంగా మారింది. మొత్తంగా అమెజాన్ లో నాలుగు నెలల్లోనే 27 వేల మంది ఉద్యోగులను తొలగించింది.

ఆర్థిక మాంద్యం వార్తల నేపథ్యంలో ప్రపంచ దిగ్గజ సంస్థలు ఉద్యోగులను ఇంటికి పంపిస్తున్నాయి. ప్రపంచంపై ఆర్థిక మాంద్యం భయాలు కమ్ముకుంటున్నాయి. ఈ ప్రభావం ఐటీ, టెక్ రంగాలపై అధికంగా ఉంది. ఉద్యోగం ఎప్పుడు ఉంటుందో.. ఎప్పుడు ఊడుతుందోననే ఒత్తిడిలో ఐటీ ఉద్యోగులు పని చేస్తున్నారు. మాంద్యం భయాలు వారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, ట్విట్టర్, మెటా వంటి దిగ్గజ కంపెనీలు గత ఆరు నెలల్లోనే వేలాది మందిని తొలగించాయి. కొత్త ఏడాదిలోనే దాదాపు లక్ష మందికిపైగా ఐటీ, టెక్ కంపెనీల ఉద్యోగులు ఉపాధి కోల్పోయారు.