రాష్ట్రంలో అమెజాన్‌ ఐదో  ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్‌‌!

రాష్ట్రంలో అమెజాన్‌ ఐదో  ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్‌‌!


హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్రంలో ఐదో ఫుల్‌‌ఫిల్‌‌మెంట్ సెంటర్‌‌‌‌ను అమెజాన్​ లాంచ్​ చేసింది.  ఇప్పటికే ఉన్న ఫుల్‌‌ఫిల్‌‌మెంట్ సెంటర్‌‌ నెట్‌‌వర్క్‌‌ను  మరింత విస్తారిస్తామని పేర్కొంది.  కొత్తగా ఏర్పాటు చేయబోయే ఫుల్‌‌ఫిల్‌‌మెంట్ సెంటర్‌‌‌‌ మొత్తం రెండు లక్షల చదరపు అడుగు ఏరియాలో విస్తరించి ఉంటుంది. ఈ  సెంటర్‌‌‌‌ ద్వారా ఆరు లక్షల క్యూబిక్ అడుగుల స్టోరేజి కేపాసిటీ క్రియేట్ అవుతుందని అమెజాన్ ఓ స్టేట్‌‌మెంట్‌‌లో పేర్కొంది. పెద్ద పెద్ద హోమ్‌‌ అప్లియెన్స్‌‌లు, ఫర్నిచర్‌‌‌‌ను ఈ సెంటర్‌‌‌‌లో స్టోర్‌‌‌‌ చేసుకోవచ్చని, రాష్ట్రంలోని సుమారు 35 వేల మంది సెల్లర్లకు ఈ కొత్త ఫుల్‌‌ఫిల్‌‌మెంట్ సెంటర్ వలన లాభం చేకూరుతుందని కంపెనీ ప్రకటించింది. రాష్ట్రంలో డైరెక్ట్‌‌, ఇన్‌‌డైరెక్ట్ జాబ్స్‌‌ క్రియేట్ అవుతాయని తెలిపింది. దేశంలో  తన స్టోరేజి కెపాసిటీని పెంచుకోవాలని  అమెజాన్ చూస్తోంది. ఇందులో భాగంగా తెలంగాణలో తన ఫుల్‌‌ఫిల్‌‌మెంట్ నెట్‌‌వర్క్‌‌ను విస్తరిస్తోంది. తాజాగా ప్రకటించిన ఫుల్‌‌ఫిల్‌‌మెంట్ సెంటర్‌‌‌‌ కూడా అందుబాటులోకి వస్తే, రాష్ట్రంలో అమెజాన్‌‌కు 10‌‌‌‌ లక్షల చదరపు అడుగుల ఫ్లోర్ ఏరియా, 50 లక్షల క్యూబిక్ అడుగుల స్టోరేజి కెపాసిటీ  అందుబాటులో ఉంటుంది. కొత్త ఫుల్‌‌ఫిల్‌‌మెంట్ సెంటర్‌‌‌‌లో ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషిన్లు, టీవీలు వంటి ప్రొడక్ట్‌‌లను స్టోర్ చేయడానికి వీలుంటుంది. అమెజాన్‌‌కు తెలంగాణలో ఇన్వెస్ట్ చేయడానికి ముందుకొచ్చిందని, ఇది రాష్ట్రం బిజినెస్‌‌, ఇన్నొవేషన్ హబ్‌‌గా ఎదిగిందనడానికి రుజువని రాష్ట్ర ఇండస్ట్రీస్‌‌ మినిస్టర్‌‌‌‌ కేటీ రామారావు అన్నారు. రాష్ట్రంలో కంపెనీ ఇన్వెస్ట్‌‌మెంట్‌‌ వలన లోకల్ ఎకానమీ డెవలప్ అవుతుందని  అమెజాన్‌‌ పేర్కొంది. ‌‌