మే8 నుంచి.. అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్

మే8 నుంచి.. అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్

హైదరాబాద్​, వెలుగు: అమెజాన్ ఇండియా ఈ నెల ఎనిమిది నుంచి గ్రేట్ సమ్మర్ సేల్ 2026ను ప్రారంభించనుంది. ఈ సేల్‌‌లో స్మార్ట్‌‌ఫోన్లు, ఫ్యాషన్, హోమ్ అప్లయన్సెస్ వంటి వాటిపై భారీ డిస్కౌంట్లు లభిస్తాయి. శామ్​సంగ్, యాపిల్, వన్​ప్లస్ వంటి బ్రాండ్ల నుంచి కొత్త ఉత్పత్తులు విడుదల కానున్నాయి. ప్రైమ్ సభ్యులకు ప్రత్యేక ఆఫర్లతో పాటు రూ.2,500 కంటే ఎక్కువ కొనుగోలు చేస్తే రూ.250 క్యాష్‌‌బ్యాక్ లభిస్తుంది.  నో-కాస్ట్ ఈఎంఐ, బ్యాంక్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు పొందవచ్చు. మొబైల్స్‌‌పై 40 శాతం వరకు తగ్గింపు, రూ.66 వేల వరకు ఎక్స్ఛేంజ్ ప్రయోజనాలు పొందవచ్చు. హోమ్ అప్లయన్సెస్‌‌పై 65 శాతం వరకు డిస్కౌంట్లు ఉంటాయి.