సెల్లర్ల ఫీజులను తగ్గించిన అమెజాన్​

సెల్లర్ల ఫీజులను తగ్గించిన అమెజాన్​

హైదరాబాద్, వెలుగు : ప్రస్తుతం కొనసాగుతున్న సేల్​ద్వారా తమ సెల్లర్లు మరింత లాభపడటానికి వివిధ కార్యక్రమాలు చేపట్టినట్టు ఈ–కామర్స్​కంపెనీ అమెజాన్ ​ప్రకటించింది. అమ్మకందారులు తమ ఆదాయాలను పెంచుకోవడానికి,  మెరుగైన ధరలను అందించడంలో సహాయపడటానికి ఫీజులను తగ్గించినట్టు తెలిపింది. కిరాణా, ఫ్యాషన్,  ఎలక్ట్రానిక్స్ వంటి విభాగాలలో 3శాతం నుంచి 12శాతం వరకు సెల్లింగ్​ఫీజును తగ్గించినట్టు సంస్థ సీనియర్​ ఎగ్జిక్యూటివ్​ఒకరు చెప్పారు. 

తెలంగాణ నుంచి 55వేల కంటే ఎక్కువ మంది తమ ఉత్పత్తులను అమెజాన్​లో అమ్ముతున్నట్టు తెలిపింది. మహిళా సెల్లర్లను ప్రోత్సహించడానికి సహేలీ కార్యక్రమాన్ని చేపట్టామని అమెజాన్ ఇండియా సేల్స్ డైరెక్టర్ గౌరవ్ భట్నాగర్ చెప్పారు. తెలంగాణలో స్మాల్​మీడియా బిజినెస్​లను (ఎస్​ఎంబీ)లను బలోపేతం చేస్తామన్నారు. 

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐఐ),  మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్) ద్వారా సెల్లర్లు అమ్మకాలను పెంచుకునేలా సాయపడుతున్నామని వివరించారు. లిస్టింగ్ అడ్వర్టైజింగ్, ఫోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కాస్ట్ డిమాండ్, కేటలాగ్ క్వాలిటీ,  ప్రోడక్ట్ లిస్టింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను బాగా నిర్వహించేలా సలహాలు ఇస్తున్నామన్నారు.