
న్యూఢిల్లీ: ఆన్‌లైన్ కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ 5జీ రివల్యూషన్ సేల్ పేరుతో 5జీ ఫోన్లపై ఆఫర్లు ప్రకటించింది. సేల్ శనివారం మొదలయింది. ఈ నెల 31 వరకు కొనసాగుతుంది. వన్ ప్లస్, రియల్మీ, శామ్సంగ్ వంటి టాప్ బ్రాండ్‌ల నుండి 5జీ ఫోన్‌లపై సేల్ 40శాతం వరకు తగ్గింపు ఉంటుందని తెలిపింది. నెలకు రూ.1,666 నుంచి నో -కాస్ట్ ఈఎంఐ సదుపాయాన్ని కూడా వాడుకోవచ్చు. రూ.10 వేల వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ ఉంటుంది. కొన్ని స్మార్ట్‌ఫోన్‌లు కొంటే ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా 24 నెలల వరకు ప్రైమ్ మెంబర్‌షిప్‌ను పొందవచ్చు. కొన్ని బ్యాంకుల కార్డులతో కొంటే డిస్కౌంట్స్ ఉంటాయి.సేల్‌లోని 5జీ ఫోన్‌లపై డీల్స్ వివరాలు ఇలా ఉన్నాయి.
ఐకూ 11 5జీ
క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్‌తో పనిచేసే ఈ స్మార్ట్‌ఫోన్ రూ.5 వేల ఎక్స్చేంజ్ తగ్గింపుతో లభిస్తుంది. తొమ్మిది నెలల వరకు నో–కాస్ట్ ఈఎంఐ ఆఫర్‌ను కూడా అమెజాన్ అందిస్తోంది. ఈ ఫోన్ 2కే అమోలెడ్ డిస్ తో వస్తుంది. 8జీబీ ర్యామ్ +256జీబీ స్టోరేజ్ఉంటుంది.
రెడ్మీ నోట్ 12 5జీ
ఈ ఫోన్‌ను బ్యాంక్ ఆఫర్‌లతో పాటు రూ.2వేల ఎక్స్చేంజ్ బోనస్‌తో కొనుగోలు చేయవచ్చు. ఈ హ్యాండ్ సెట్‌కు 120 హెజ్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే ఉంటుంది. ఇది క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 1 ప్రాసెసర్‌తో వస్తుంది. వెనుకవైపు 48 మెగాపిక్సెల్ ఏఐ ట్రిపుల్ కెమెరా ఉంటుంది.
షావోమీ 13 ప్రొ
ఈ ఫోన్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2, 4ఎన్ఎం ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ప్రస్తుత ధర రూ.71,999. బ్యాంక్ ఆఫర్లు ఉన్నాయి. రూ.10వేల అదనపు ఎక్స్ఛేంజ్ తగ్గింపుతో లభిస్తుంది. హ్యాండ్‌సెట్‌లో 6.73 అంగుళాల 2కే అమోలెడ్ డిస్‌ప్లే, 4,820 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటాయి.
వన్‌ప్లస్ 10 ప్రో
బ్యాంక్ ఆఫర్లు, రూ.10వేల ఎక్స్ఛేంజ్ బోనస్‌తో ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ.55,499లకు కొనుగోలు చేయవచ్చు. తొమ్మిది నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ సదుపాయాన్ని కూడా పొందవచ్చు. హ్యాండ్‌సెట్‌లో 48మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా, 8మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉన్నాయి.
వన్‌ప్లస్ 10ఆర్ 5జీ
ఫోన్ ప్రస్తుత ధర రూ.32,999 కాగా, సేల్‌లో రూ.3వేల ఎక్స్ఛేంజ్ బోనస్‌తో పాటు 6 నెలల వరకు నో–కాస్ట్ ఈఎంఐ సదుపాయాన్ని దక్కించుకోవచ్చు. ఇందులో 50మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది.
రియల్మీ నార్జో 50 5జీ
ఈ మిడ్‌రేంజ్ ఫోన్లో 6.6 అంగుళాల డిస్‌ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 810 5జీ గేమింగ్ ప్రాసెసర్ 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటాయి. దీనిపై బ్యాంక్ ఆఫర్‌తోపాటు రూ.3వేల అదనపు ఎక్స్ఛేంజ్ ఆఫర్ ఉంది. ఫలితంగా రూ.14,249లకే దక్కించుకోవచ్చు. శామ్సంగ్ ఎం14 5తోపాటు టెక్నో ఫాంటమ్ ఎక్స్2 ప్రో 5జీ ఫోన్లపైనా ఆఫర్లు ఉన్నాయి.