
హైదరాబాద్, వెలుగు: ఫ్రెష్ మిల్లెట్ (చిరుధాన్యాల) స్టోర్ను అమెజాన్ ప్రారంభించింది. ఇందులో వివిధ రకాలైన మిల్లెట్లు, మిల్లెట్ ఉత్పత్తులు లభిస్తాయి. వీటిలో ఫైబర్, ప్రోటీన్, ఐరన్ ఫోలేట్ వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయని అమెజాన్ పేర్కొంది. ఈ స్టోర్‌లో అన్ని రకాల మిల్లెట్లు, వాటితో తయారుచేసిన ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయి. స్లర్రప్ ఫారం, ద బెటర్ ఫ్లోర్, టాటా సోల్ ఫుల్, మిల్లీ, ఆర్గానిక్ తత్వ బ్రాండ్ల ప్రొడక్టులు లభిస్తాయని తెలిపింది.