ఎండాకాలం సెలవులు రానే వచ్చాయి. పిల్లలంతా ఆటపాటలతో ఎంజాయ్ చేసే సమయం ఇది. ఈ వేసవిని మరింత సరదాగా మార్చేందుకు ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ అదిరిపోయే ఆఫర్లతో ముందుకొచ్చింది. పిల్లల కోసం ప్రత్యేకంగా సమ్మర్ సేల్‌ను ప్రకటించింది.
అమెజాన్ తన ప్లాట్‌ఫాంపై కిడ్స్ సమ్మర్ స్లామ్, సమ్మర్ టాయ్స్ లిస్ట్ పేర్లతో రెండు ప్రత్యేక స్టోర్లను ప్రారంభించింది. ఇందులో భాగంగా పిల్లలు ఆడుకునే బొమ్మలు, వేసవి తాపాన్ని తీర్చే స్విమ్మింగ్ కిట్లు, అలాగే సైకిళ్లపై ఏకంగా 50 శాతం వరకు భారీ తగ్గింపును అందిస్తోంది.
బ్యాంక్ ,ప్రైమ్ బెనిఫిట్స్: సాధారణ తగ్గింపులతో పాటు అదనపు బ్యాంక్ ఆఫర్లను కూడా అమెజాన్ ప్రకటించింది. ఐసీఐసీఐ (ICICI) క్రెడిట్ కార్డు ఉపయోగించి కొనుగోలు చేస్తే 5 శాతం తక్షణ రాయితీ లభిస్తుంది. ఇతర ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులపై 7.5 శాతం వరకు డిస్కౌంట్ పొందవచ్చు.
ఇక అమెజాన్ ప్రైమ్ (Amazon Prime) సభ్యులకు ఆర్డర్ చేసిన రోజునే వస్తువులను అందించే సేమ్ డే డెలివరీ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది.
AI టూల్స్‌తో స్మార్ట్ షాపింగ్:
కస్టమర్ల షాపింగ్ అనుభవాన్ని మరింత సులభతరం చేసేందుకు అమెజాన్ ఆధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టూల్స్ వినియోగిస్తోంది. ఏఐ అసిస్టెంట్ రూఫస్ , ఫోటో ద్వారా వస్తువులను వెతికే 'లెన్స్ ఏఐ' (Lens AI), అలాగే సరైన ధరకే కొంటున్నామా లేదా అని చెక్ చేసుకునే ప్రైస్ హిస్టరీ ఫీచర్లను ఉపయోగించి వినియోగదారులు స్మార్ట్‌గా షాపింగ్ చేయవచ్చు.
