Amazon Vs Flipcart Republic Day sales: స్మార్ట్ ఫోన్స్, ల్యాప్ టాప్స్పై భారీ ఆఫర్లు

Amazon Vs Flipcart Republic Day sales: స్మార్ట్ ఫోన్స్, ల్యాప్ టాప్స్పై భారీ ఆఫర్లు

రిపబ్లిక్ డే సమీపిస్తున్న క్రమంలో ఈ కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్ కార్ట్ మీకు ఇష్టమైన గాడ్జెట్స్ లను ఆకట్టుకునే ధరల్లో అందించడానికి సిద్దంగా ఉన్నాయి అమెజాన్ రిపబ్లిక్ డే సేల్ ను జనవరి 14 నుంచి ప్రారంభిస్తోంది. ఐఫోన్ 13, వన్ ప్లస్ 11 సహా వివిధ రకాల స్మార్ట్ ఫోన్లు భారీ డిస్కౌంట్ తో లభిస్తాయి.

అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 

అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ జనవరి 14 నుంచి ప్రారంభం కానుంది. ల్యాప్ టాప్ లు, స్మార్ట్ ఫోన్లు, గాడ్జెట్స్, వంటివాటిపై భారీ డిస్కౌంట్లను అందించనుంది. ప్రైమ్ నెంబర్లకు ముందస్తు యాక్సెస్ ఉంటుంది. SBi బ్యాంక్ క్రెడిట్ కార్డలు, EMI లావాదేవీలపై 10 శాతం డిస్కౌంట్ ఉంటుంది. 

 అమెజాన్ డీల్స్ :

ఐఫోన్ 13, Samsung Galaxy S23, OnePlus Nord CE3 LIte, Motorola Razr 40 Ultra తో సహా ప్రముఖ ఫోన్లపై అమెజాన్ డిస్కౌంట్లను టీజ్ చేసింది. Galaxy S24,One Plus  12 సిరీస్, IQOO Z7 Pro 5G, Redmi 13 సిరీస్, వంటి రాబోయే లాంచ్ లను కూడా ఈ సేల్ లో పొందొచ్చు.

Flipcart డీల్స్ : 

ఫ్లిప్ కార్ట్ .. రిపబ్లిక్ డే సేల్ లో ప్రముఖ ఫోన్లపై భారీ తగ్గింపులకు సేల్ కు సిద్దమవుతోంది. ఖచ్చితమైన ధరలు వెల్లడించనప్పటికీ టాప్ డీల్స్ లో iPhone 15, Samsung Galaxy S21 FE 5G, Motorola Edge 40 Neoలతో పాటు Apple డివైజ్ లపై డిస్కౌంట్ ఇవ్వనుంది. 

స్మార్ట్ ఫోన్లే కాకుండా ల్యాప్ టాప్ లు వంటి ఇతర గాడ్జెట్ లపై 75 శాతం డిస్కౌంట్ ఉంటుంది. స్మార్ట్ వాచ్ లపై 65 శాతం వరకు తగ్గింపును అందిస్తాయి. మీరు కొత్త ఫోన్, ల్యాప్ టాప్, ఇతర యాక్సెసరీస్ కోసం చూస్తున్నట్లయితే రిపబ్లిక్ డే సేల్స్ డీల్స్  పొందేందుకు సువర్ణావకాశం.