అమెజాన్ ‘ప్రైమ్ డే-2020’ ఆఫర్లు

అమెజాన్  ‘ప్రైమ్ డే-2020’ ఆఫర్లు

అమెరికా కంటే ముందు ఇండియాలోనే ప్రైమ్ డే – 2020

న్యూఢిల్లీ: కరోనా వైరస్ అవుట్‌ బ్రేక్‌‌ ‌‌తర్వాత తొలిసారి అమెజాన్ ‘ప్రైమ్ డే’ను నిర్వహిస్తోంది. బుధవారం అర్థరాత్రి నుంచి ఈ సేల్ ప్రారంభం అయింది. ఈ ప్రైమ్ డేలో కస్టమర్లకు భారీగా డిస్కౌంట్లను, వందల కొద్దీ ఎక్స్‌‌‌‌ క్లూజివ్ ప్రొడక్ట్ లను, ‌ కొత్త లాంఛ్‌లను, క్యాష్‌ బ్యాక్ ఆఫర్ల ప్రవేశపెడుతోంది. అయితే అంతకు ముందు లాగ కాకుండా వర్చ్యువ ల్‌గా అమెజాన్ ఆపరేషన్స్ ను చేపట్టనుంది. ప్రస్తుతం చాలా మంది ఉద్యోగులు వర్కు ఫ్రమ్ హోమ్ చేస్తుండటంతో, వారి ఇళ్ల నుంచే ఈ సేల్‌ను కోఆర్డినేర్డిట్ చేయనున్నారు. ప్యాకర్స్, డెలివరీమెన్ విషయంలో అన్ని రకాల హైజీన్ ప్రోటోకాల్స్ ను అమెజాన్ పాటించనుంది.

వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్‌కు ఎమర్జెన్సీ గా అవసరమైన అన్ని రకాల ప్రొడక్ట్ లపై ‌‌ డిస్కౌంట్లను అమెజాన్ ఆఫర్ చేస్తోంది. అమెజాన్ ప్రైమ్ మెంబర్లకు పలు ప్రొడక్ట్ లను ట్‌‌‌‌ ఉచితంగా డెలివరీ చేయనుంది. అంతేకాక పలు ఆఫర్లను వారికి అందుబాటులోకి తెచ్చింది. లాక్‌‌‌‌డౌన్‌ ఆంక్షలు ఎత్తివేసిన తర్వాత స్మార్ట్‌‌‌‌ ఫోన్ సేల్స్ పెరిగాయి. దీంతో ఈ ప్రైమ్‌డేలో స్మార్ట్‌‌‌‌ ఫో‌ న్లు, ఇతర యాక్ససరీస్‌పై పలు డీల్స్ ను ప్రకటించింది. ఈ ఈ–కామర్స్ కంపెనీకి, ఫౌండర్ జెఫ్ బెజోస్‌కు ఇండియా టెస్ట్ కేసుగా ఉంది.

అమెరికాలో జూలైలో జరగాల్సిన ప్రైమ్ డేను ఆ కంపెనీ వాయిదా వేసింది. ‘చాలా చర్చల అనంతరం, ప్రైమ్ డేతో ముందుకు వెళ్లాలని మేము నిర్ణయించాం’ అని అమెజాన్ ఇండియా ప్రైమ్ హెడ్‌ అక్షయ్ సాహి అన్నారు. అమెజాన్ 48 గంటల పాటు ఈ సేల్‌ను నిర్వహించనుంది. సీటెల్‌కు చెందిన ఈ కంపెనీ వా ల్‌మార్ట్ ‌‌కు ‌‌ చెందిన ఫ్లిప్‌కార్ట్ ‌‌‌తో, ‌‌ రిలయన్స్ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌తో పోటీ పడుతోంది. రిలయన్స్ కు చెందిన జియో ప్లాట్‌మ్స్ పైన గ్రోసరీ డెలివరీ సర్వీసులను 200 సిటీల్లో ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఫ్లి ప్‌ కార్ట్ కూడా తన బిగ్ సేవింగ్స్ డేను ప్రకటించింది.