కులం కాదు.. అహం మా కథ : సుహాస్

కులం కాదు.. అహం మా కథ : సుహాస్

కలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫొటో, రైటర్ పద్మభూషణ్‌‌‌‌‌‌‌‌ చిత్రాలతో హీరోగా మెప్పించిన సుహాస్.. ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. దుశ్యంత్ కటికినేని దర్శకత్వంలో ధీరజ్ మొగిలినేని నిర్మించిన ఈ మూవీ ఫిబ్రవరి 2న విడుదలవుతోంది. ఈ సందర్భంగా సుహాస్ మాట్లాడుతూ  ‘దర్శకుడు దుశ్యంత్  రియల్ ఇన్సిడెంట్స్‌‌‌‌‌‌‌‌ ఆధారంగా  2007 బ్యాక్‌‌‌‌‌‌‌‌డ్రాప్‌‌‌‌‌‌‌‌లో ఈ  చిత్రాన్ని రూపొందించాడు.  దీని కోసం బ్యాండ్ కొట్టడం నేర్చుకున్నా. కథకు తగ్గట్టుగా రెండు సార్లు గుండు గీయించుకున్నా.  ఇంటర్వెల్‌‌‌‌‌‌‌‌కు ఇరవై నిమిషాల ముందు వరకు సరదాగా సాగుతుంది. అక్కడి నుంచి ఎమోషనల్‌‌‌‌‌‌‌‌ ఫీల్‌‌‌‌‌‌‌‌తో సాగుతుంది. ఇందులో కులాల ప్రస్తావన ఉంటుంది కానీ  మనుషుల మధ్య అహం ఎలాంటి అడ్డుగోడలు సృష్టిస్తుంది అనేది మెయిన్ పాయింట్. నేను, శరణ్య కవల పిల్లలం. 

మా పుట్టినరోజున జరిగిన సంఘటనలు జీవితాలను ఎలాంటి మలుపులు తిప్పాయి అనేది కీలకంగా ఉండే అంశం. ఈ సన్నివేశాల్లో కొన్ని మన జీవితాల్లో కూడా జరిగాయని అనిపిస్తుంది.  గతేడాది ఫిబ్రవరిలో ‘రైటర్ పద్మభూషణ్ రిలీజై మంచి సక్సెస్ అందుకుంది. ఈ ఫిబ్రవరికి ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ థియేటర్స్‌‌‌‌‌‌‌‌లోకి వస్తోంది. ఈ సినిమా కూడా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. ఈ మధ్యే బాబు పుట్టాడు. మంచి జరుగుతుందనే అనిపిస్తోంది.  ఈ చిత్రాన్ని యూఎస్‌‌‌‌‌‌‌‌లో కూడా 200 లొకేషన్స్‌‌‌‌‌‌‌‌లో రిలీజ్ చేస్తున్నారు.  హీరోగా కంటే నటుడిగా పేరు తెచ్చుకోవడమే నాకు ఇష్టం. ఒకే టైప్ కాకుండా డిఫరెంట్ కథల్లో నటించాలని ఉంది’ అని చెప్పాడు.